ప్రజలు తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బులను సురక్షితమైన దాంట్లో పెట్టుబడులు పెట్టి రెట్టింపు చేసుకోవాలనుకుంటారు. కానీ చాలా మంది ప్రజలు ఇందులో పెట్టుబడులు పెట్టాలో తెలియక వేరేవాటిల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. ఇలాంటి వారి కోసం పోస్టల్ శాఖ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. అతి తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడులను రెట్టింపు చేసుకోవడానికి ఈ పథకం ఒక మంచి ఎంపిక.
ఈ పథకం పేరు కిసాన్ వికాస్ పాత్ర స్కీం. ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ప్రజలు భయపడవలసిన అవసరం లేదు. ఈ పథకంలో కొంత నిర్దిష్ట మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సిఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కొంతకాలంలోనే మీ సొమ్మును రెట్టింపు అవుతుంది. ఈ పథకం ప్రజలకు అనేక విధాలుగా సహాయపడుతుంది.
ఈ కిసాన్ వికాస్ పాత్ర పథకాన్ని ఎవరు పొందవచ్చు అంటే వయస్సు అనేది 18 సంవత్సరాలు నిండిఉండాలి లేదా 18 సంవస్తరు పైబడిన వ్యక్తులు ఈ పథకాన్ని పొందవచ్చు. ఒకవేళ మైనర్ ఈ పథకాన్ని పొందాలి అనుకుంటే అతని సంరక్షకుడి పేరు మీద ఈ పథకాన్ని పొందే అవకాశం ఉంది. ఈ పథకంతో మరి ఉపయోగం ఏమిటంటే, ఇందులో పెట్టిన పెట్టుబడులను హామీ ఇస్తూ రుణం పొందే అవకాశం కూడా ఉంది. ఈ రుణానికి రిటర్న్స్ లో పన్ను కట్టవలసి ఉంది.
ఇది కూడా చదవండీ..
పోస్ట్ ఆఫీస్ కొత్త పథకం... రూ.50 లక్షలు హామీ మరియు రుణ సౌకర్యం
ఇటీవలి ఆర్బిఐ కొత్తగా రేపో రేట్లను సవరించింది. దీనివలన ఈ పథకం ఎంచుకున్న వాళ్లకు అధిక రాబడి వస్తుంది. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టిన 10 సంవత్సరాలకు డబ్బులు రెట్టింపు అవుతాయి. ఈ పథకానికి కనిష్ట పెట్టుబడి అనేది 1000 నుండి మొదలు అవుతుంది. పైగా ఈ పథకానికి గరిష్ట పరిమితి కూడా లేదు, ఎంత వరకైనా పెట్టుబటుడులు పెట్టచ్చు. ప్రస్తుతం ఈ పథకానికి ఏడాదికి 7.2 % వడ్డీని అందిస్తున్నారు. సుమారుగా మీరు పెట్టుబడి పెట్టిన సొమ్ము 120 నెలలో రెట్టింపు అవుతుంది.
ఇది కూడా చదవండీ..
Share your comments