భారతదేశంలో వివిధ రకాల భీమాల వల్ల కలిగే ప్రయోజనాల ప్రాధాన్యత ప్రజలకు బాగా అర్ధం అవ్వింది. దేశంలో ఈ ఇటువంటి పాలసీలను తీసుకునే సంఖ్య కూడా పెరుతూనే ఉంది. తపాలా కార్యాలయం కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త రకాల స్కీంలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది.
తపాలా కార్యాలయం కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన పథకం పేరు "పోస్ట్ ఆఫీస్ జీవిత బీమా పథకం"(పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ - పిఎల్ఐ) . పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఉత్తమ పథకాల్లో ఈ పోస్ట్ ఆఫీస్ జీవిత బీమా పథకం కూడా ఒకటి. ఈ పోస్ట్ ఆఫీస్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం వలన ప్రజలకు నష్టం కలుగదు, ఎందుకనగా ఈ పథకాలు అన్ని కేంద్ర ప్రభత్వం పర్యవేక్షణలో జరుగుతాయి. కాబట్టి ప్రజలు ధైర్యంగా వీటిలో పెట్టుబడులు పెట్టచ్చు.
పోస్ట్ ఆఫీస్ జీవిత బీమా పథకంలో పెట్టుబడి పెట్టిన వ్యక్తి 50 లక్షల రూపాయల వరకు భీమా కవరేజిను మరియు వాటితో పాటు వేరే ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఉన్న అన్ని భీమా పథకాల్లో ఈ పథకమే ప్రాచీనమైనది, ఈ పథకాన్ని 1884 లో మొదటి సారి ప్రవేశపెట్టారు. ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి.
అవి ఏమిటంటే పిఎల్ఐ అండ్ ఆర్పి ఎల్ఐ. ఈ పిఎల్ఐ కింద మొత్తానికి 6 పాలసీలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ సంపూర్ణ జీవిత బీమా పాలసీ(హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ). ఈ పాలసీకి గరిష్టంగా రూ.50 లక్షలు మరియు కనిష్టంగా రూ.20,000 పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవేళ భీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే, ఆ మొత్తం డబ్బులను నామినిగా ఎవరి పేరు ఉంటె వారికీ చెల్లిస్తారు. ఈ పాలసీ యొక్క మొత్తం సమ్ అష్యూర్డ్ డబ్బును ఆ వ్యక్తికి 80 సంవత్సరాలు వచ్చాక అందజేస్తారు.
ఇది కూడా చదవండి..
ఒక్క రూపాయితో 10 లక్షల ప్రమాద భీమా !
పోస్ట్ ఆఫీస్ జీవిత బీమా పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టేందుకు 2 కేటగిరీలలో ఆప్షన్లు ఉంటాయి. అవి.. PLI & RPLI. PLI పథకం కింద 6 పాలసీలు అమలు అవుతున్నాయి. వాటిలో ఒకటి హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ (whole life insurance policy). సంపూర్ణ జీవిత బీమా పాలసీ కింద, కనీస హామీ మొత్తం రూ. 20,000 - గరిష్ట హామీ మొత్తం రూ. 50 లక్షలు. ఈ పథకం తీసుకున్న వ్యక్తి 80 సంవత్సరాలకు సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని పొందుతాడు. దీని కంటే ముందే బీమాదారు మరణిస్తే, నామినీకి ఆ డబ్బు చెల్లిస్తారు.
ఈ పోస్ట్ ఆఫీస్ జీవిత బీమా పథకం పొందాలనుకునే వ్యక్తికి వయస్సు అనేది కనిష్టంగా 19 సంవత్సరాలు మరియు గరిష్టంగా 55 సంవత్సరాలు ఉండాలి. దీనిని పొందడానికి పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్సైట్ని సందర్శించవచ్చు లేదా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ పాలసీని 4 సంవత్సరాల వ్యవధితో తీసుకోవచ్చు. 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మన డబ్బును వెన్నకి తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments