భారత దేశంలోని రైతులందరికి ఆర్ధిక సహకారాన్ని అందించి వారి అభివృద్ధికి బాటలు వెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ యోజన అవలంభించింది. ఈ స్కీం ద్వారా విడతల వారీగా రైతుల ఖాతాల్లో నగదు జమవుతుంది. వ్యవసాయ భూమి కలిగి ఉంది, భారత పౌరసత్వం కలిగి ఉన్న రైతులందరు ఈ స్కీం పొందడానికి అర్హులే. అయితే కొంతమంది రైతుల అప్లికేషన్లు రిజెక్ట్ కావడం గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెల్సుకుందాం.
పిఎం కిసాన్ పొందడానికి అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో ఏడాదికి 6000 రూపాయిలు విడతల వారీగా జమవుతాయి. ఇప్పటికే ఫిబ్రవరిలో పిఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతల్లోకి వచ్చాయి. రెండో విధాత జమ చేసే సమయంలో ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడం వల్ల, వచ్చే జూన్ లేదా జులై నాటికీ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఏప్రిల్-జులై లో ఒకసారి, ఆగష్టు-నవంబర్ రెండోసారి చివరిగా డిసెంబర్-మార్చ్ మధ్య పీఎం కిసాన్ డబ్బులు అందుతాయి. పోయిన సారి ఫిబ్రవరిలో 9 కోట్ల రైతులు పీఎం కిసాన్ ద్వారా లభ్ది పొందారు. 16 వ విడత విడుదల చేసిన ఈ నిధుల కోసం 21 వేళా కోట్లు ఖర్చు చేసారు.
ఈ స్కీం కోసం అప్లై చేసిన రైతులకు కొన్ని కొన్ని సార్లు డబ్బు జమవ్వదు, మరియు కొన్నిసార్లు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థిని నియంత్రించి సకాలంలో నగదు పొందేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అప్లికేషన్ పెట్టె సమయంలో బ్యాంకు అకౌంట్ నెంబర్ సరిచూసుకోండి, అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదైతే ఈ నగదు లభించదు.
పీఎం కిసాన్ కోసం ఇ-కేవైసి తప్పనిసరి. చాల మందికి దీనిగురించి సరైన అవగాహనా లేక ఇ-కేవైసి ఇంకా పూర్తిచెయ్యలేదు. కేవైసి పూర్తి చెయ్యడానికి పీఎం కిసాన్ పోర్టల్ లో పూర్తిచేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర్లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ సందర్శించి దీనిని పూర్తిచేసుకోవచ్చు. కొన్ని సార్లు మీ ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్ తో లింక్ కానప్పుడు కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. పీఎం కిసాన్ స్కీం కోసం దరఖాస్తు చేసే సమయానికి మీ వయసు 18 దాటివుండాలి లేదంటే అటువంటి అప్లికేషన్స్ వెంటనే రిజెక్ట్ చేస్తారు.
Share your comments