సాధారణంగా చాల మంది ప్రజలు తమ భవిష్యత్తు కోసం పొదుపు మార్గాన్ని ఎంచుకుంటారు. పొదుపు చేద్దామని మన డబ్బు మన దగ్గరే దాచుకుంటే ఎం ప్రయోజనం ఉండదు. అదే ఆదాయం కోసం బయట వడ్డీలకు ఇస్తే మన డబ్బు ఎటువంటి భద్రత ఉండదు. చాల మంది తమ డబ్బును పొదుపు చేసుకోవడానికి ఉన్న పధకాల గురించి తెలియక షేర్ మార్కెట్లు అని లేదా ఇతర రిస్క్ ఉన్న పథకాల్లో పెట్టి నష్ట పోతున్నారు. కానీ అతి తక్కువ సమయంలో మన నాగఢ్ఫు రేటింపు అయ్యే పధకాలు చాలానే ఉన్నాయి. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ రేట్ల కంటే మెరుగైన పధకాలు ఉన్నాయి.
కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన వెంటనే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది.జనవరి 1 2023 నుండి పెంచిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పథకంపై వడ్డీ రేట్లను పెంచిన కేంద్రం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పి పి ఎఫ్ ), సుకన్య సమృద్ధి యోజన పథకాలపై వడ్డీ రేట్లలో ఏమాత్రం మార్పు చేయలేదు.
పెంచిన వడ్డీ రేట్లలో కనిష్టంగా 20 బేసిస్ పాయింట్లు మరియు గరిష్టంగా 110 బేసిస్ పాయింట్లు వరకు ఉంది అని కేంద్ర ప్రభత్వం ప్రకటించింది. నేషనల్ సేవింసర్టిఫికెట్స్ (ఎన్ ఎస్ సి) పైన కూడా వడ్డీ రేట్లను పెంచింది. ఇది వరకు ఎం ఎస్ సి పై 6. శాతం వడ్డీ రేటు ఉండగా 20 బేసిస్ పాయింట్లు పెరిగి ఇప్పుడు 7 శాతానికి వచ్చింది. కేంద్రం సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీంపై 40 బేసిస్ పాయింట్లు మేర వడ్డీ రేట్లను పెంచగా ఇప్పుడు అత్యధికముగా 8 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.
ఇది కూడా చదవండి..
ప్రత్యామ్నాయ ఎరువులను మరియు రాష్ట్రాలను ప్రోత్సహించడానికి PM-PRANAM ప్రారంభించబడుతుంది..
సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు కాలవ్యవధి ఉన్న పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంపై 1.1 శాతం వడ్డీ రేటును పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. మంత్లి ఇన్కమ్ పథకంపై 40 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచగా ఇప్పుడు 7.1 శాతానికి చేరింది.
కిసాన్ వికాస్ పాత్ర
కిసాన్ వికాస్ పాత్ర అనేది మన భారత ప్రభుత్వం అందిస్తున్న స్మాల్ సేవింగ్స్ స్కీంలలో ఇది కూడా ఒకటి. పథక వ్యవధిలో 123 నెలల్లోనే పెట్టిన పెట్టుబడి మొత్తం రెట్టింపు అవుతుంది అనగా పొదుపు మొత్తం రెట్టింపు అవ్వడానికి పట్టే సమయం కేవలం 10 సంవత్సరాల 3 నెలలు మాత్రమే. ఈ ఖాతాను భారతదేశంలో ఏ పోస్టాఫీస్లో అయినా తెరవవచ్చు. ఈ పధకానికి కనీస డిపాజిట్ వచ్చేసి రూ. 1000 మరియు గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. కిసాన్ వికాస్ పత్రపైన 20 బేసిస్ పాయింట్లు పెంచి వడ్డీ రేటును 7.2 శాతానికి చేర్చింది.
ఇది కూడా చదవండి..
Share your comments