Government Schemes

నేతన్న భీమా పథకం వెబ్ సైట్ ను త్వరలో ఆవిష్కరించనున్న ప్రభుత్వం !

KJ Staff
KJ Staff
Nethanna  Bhima Scheme Telangana
Nethanna Bhima Scheme Telangana

రాష్ట్రం లోనే మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆగష్టు 7 న" నేతన్న భీమా " పథకాన్ని అమలు పరిచింది. ఇది రైతు భీమా పథకం లో ఒక భాగంగా కొనసాగనుంది . నేతన్న భీమా పథకం ద్వారా రాష్టం లోని సుమారు 80000 చేనేత కార్మికులు లబ్ది పొందనున్నారు . ఎటువంటి కారణాలతోనైనా లబ్ధిదారుడు మరణిస్తే మరణించిన 10 రోజుల లోగ నామినీ ఖాతా లో రూ . 5 లక్షలు జమ చేయడం జరుగుతుంది .

తెలంగాణ ప్రభుత్వం 50 కోట్ల రూపాయలను ఈ పథకానికి కేటాయించగా 25 కోట్లు ఇప్పటికే విడుదల అయ్యాయి . ప్రభుత్వం LIC సంస్థ సహకారణ తో పథకం అమలు పరచనుంది . పథక అమలన రాష్ట్ర మరియు జిల్లాల వారీగా జరగనుంది.

పథకానికి ఎవరు అర్హులు ?


60 ఏళ్లలోపు వయసు ఉన్న చేనేత కార్మికులు ,విద్యుత్ కార్మికులు పథకాన్ని వినియోగించుకోవచ్చు ప్రభుత్వ వెబ్సైటు ద్వారా లేదా జిల్లా టెక్సటైల్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ కార్మికులు పథకానికి అప్లై చేసుకోవచ్చు.4

PMSYMY పథకం :50 రూపాయల మొత్తంతో .. నెలకు రూ . 3000 అందించే అద్భుత పథకం !

చేనేత కార్మికులకు "తెలంగాణ ప్రభుత్వం చేనేత మిత్ర పథకం, త్రిఫ్ట్ సేవింగ్ పథకం మొదలగునవి వంటివి ప్రభుత్వం అమలు చేస్తుంది , చేనేత కార్మికుల సంక్షేమం కోసం మరెన్నో పథకలని ప్రారంభిస్తాము" అని గతం లో KTR వెల్లడించారు. వారు మాట్లాడుతూ చేనేత శాఖ త్వరలో UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన రామప్ప ఆలయ శిల్పాలను చిత్రీకరించిన "రామప్ప చీరలు" ను విడుదల చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క చేనేత మిత్ర , నేతన్నకు చేయూత , పావలా వడ్డీ మొదలగు పథకాలను మెచ్చి మధ్య ప్రదేశ్ , ఒడిశా , కర్ణాటక రాష్ట్రాల ప్రత్యేక శాఖలు వచ్చి తెలంగాణ ప్రభుత్వ పథకాలను వాటిని అమలు పరిచిన పద్దతులను క్షుణ్ణంగా విపరిశీలించినట్టుగా తెలిపారు .

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)2022: @ 436 తో ప్రీమియం ప్రయోజనాలు ఏమిటి ?

Share your comments

Subscribe Magazine