పేద , మధ్య తరగతి కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ మరియు బ్యాంకుల లలో చిన్న మొత్తం డబ్బులను జమచేసుకొని
ఆర్థిక ప్రగతి సాధించడానికి కొన్ని samll saving schemes చిన్న పొదుపు పథకాలను అమలు పరుస్తుంది . అందులో ముఖ్యమైనది ఆడ పిల్లలకోసం అమలు పరిచే పథకం సుకన్య సమృద్ధి యోజన .
వీటిల్లో ఆడ పిల్లల కోసం కూడా ఒక స్పెషల్ స్కీమ్ అందుబాటులో ఉంది. అదే సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కీమ్ కేవలం అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో చేరడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.
పదేళ్ల వరకు వయసు కలిగిన ఆడ పిల్లలు మాత్రమే సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరేందుకు అర్హత కలిగి ఉంటారు. ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిల పేరుపై సుకన్య సమృద్ధి అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు. కవలలు పుడితే ముగ్గురి పేరుపై కూడా ఈ ఖాతా తెరిచే వెసులుబాటు ఉంటుంది.
కనీసం 250 రూపాయనుంచి 1. 5 లక్షలవరకు అమ్మాయి పేరుమీద జమచేయవచు , దీనిపై 7. 5 వడ్డీ లభిస్తుంది .
పథకం ద్వారా లభించే ప్రయోజనాలు :
కనిష్ట డిపాజిట్ ₹ 250/- ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ట డిపాజిట్ ₹ 1.5 లక్షలు.
10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఆడపిల్ల పేరు మీద ఖాతాను తెరవవచ్చు.
ఆడపిల్లల పేరిట ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది.
పోస్టాఫీసుల్లో మరియు అధీకృత బ్యాంకుల్లో ఖాతా తెరవవచ్చు.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)2022: @ 436 తో ప్రీమియం ప్రయోజనాలు ఏమిటి ?
విద్య ఖర్చులను తీర్చడానికి ఖాతాదారు యొక్క ఉన్నత విద్య ప్రయోజనం కోసం ఉపసంహరణ అనుమతించబడుతుంది.
18 ఏళ్లు నిండిన తర్వాత ఆడపిల్లకు వివాహం జరిగితే ఖాతాను ముందుగానే మూసివేయవచ్చు.
ఖాతాను భారతదేశంలో ఎక్కడికైనా ఒక పోస్టాఫీసు/బ్యాంకు నుండి మరొకదానికి బదిలీ చేయవచ్చు.
ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాల వ్యవధి పూర్తయిన తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది.
I.T. చట్టంలోని సెక్షన్.80-C కింద డిపాజిట్ మినహాయింపుకు అర్హత పొందుతుంది.
ఐ.టి.చట్టంలోని సెక్షన్ -10 కింద ఖాతాలో సంపాదించిన వడ్డీ పై ఆదాయపు పన్ను మినహాయింపు .
Share your comments