తెలంగాణ వ్యవసాయశాఖ రైతు బీమాకు సంబంధించి కీలకమైన ఉత్తర్వులు జారీచేసింది. ఈ భీమా పొందేదుకు అర్హత ఉన్న రైతులు ఆగష్టు 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించి. మరిన్ని స్కీం వివరాలు మీ కోసం....
ఏమైనా కారణాల వల్ల రైతు మృతి చెందితే, వారి కుటుంబాలకు భీమా సొమ్ము అందించేవిధంగా, 2018 లో అప్పటి ప్రభుత్వం రైతు భీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీం ప్రకారం బాధిత కుటుంబాలకు ఐదు లక్షల వరకు భీమా సొమ్ము అందుతుంది. ఈ స్కీం మొదలుపెట్టినప్పుడు, దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు పేరిట, రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసి కి రూ. 2,271 చెల్లించేవారు, గత ఏడాది నుండి ఈ మొత్తం రూ. 3,556 చొప్పున చెల్లిస్తుంది. ఈ ఏడాది గతంలో ఉన్న పోలసీలను రెన్యూవల్ చెయ్యడంతో పాటు, కొత్తగా అర్హులైన రైతులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు ఆగష్టు 5 లోపు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు అవకాశమున్న రైతులు స్థానిక ఏఈఓకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించింది. ఈ స్కీం ప్రారంభించిన మొదట్లో తోలి రెండు సంవత్సరాలు ఎప్పటికప్పుడు దరఖాస్తులు స్వీకరించేవారు, అయితే 2020 నుండి వానాకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ స్కీం కోసం దరఖాస్తులు స్వీకరిస్తూ వస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించిన రైతుల పేరిట, ఎల్ఐసి సూచించిన విధంగా ప్రభుత్వం ప్రీమియం చె
స్కీం కి కావాల్సిన అర్హతలు:
- నమోదు చేసుకునే లబ్ధిదారుల వయసు 18 నుండి 59 ఏళ్లలోపు వారు మాత్రమే అయ్యుండాలి.
- ఇప్పటికే ఈ పథకంలో నమోదు చేసుకున్న వారు తిరిగి మళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
- ఈ నెల 28 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు అర్హులుగా పరిగణిస్తారు, వీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఏఈవోల వద్ద ఆయా గ్రామాల జాబితాలు ఉంటాయి. అయితే పేరు నమోదు చేసుకునే రైతు స్థానికంగా ఉండాలి.
స్కీం కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకునే రైతులు పట్టాదార్ పాస్బుక్ లేదా డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపర్, వీటితోపాటు, ఆధార కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్, మరియు నామిని ఆధార్ కార్డును దరఖాస్తులో జతపరచవల్సి ఉంటుంది. చట్టపరంగా వారసత్వం కలిగిన రైతులు మాత్రమే నామినిగా అర్హులు. గతంలో దరఖాస్తు చేసుకున్న పథకంలో నామినీలు చనిపోతే, నామిని పేరు మార్చుకునే అవకాశం ఉంది.
Share your comments