చిరు వ్యాపారాలు చేసుకోవాలనుకునే మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం "ఉద్యోగిని పథకం "అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది . చిన్న వయపరం చేయాలనే ఆశ వున్నా ఆర్థిక చేసయుత అందని మహిళలకోసం ప్రత్యేకంగా ఈ పథకం పని చేస్తుంది. ఈ పథకం ద్వారా మహిళలు 3 లక్షల రూపాయల వరకు లోన్ పొందే అవకాశం ఉంది. ఈ డబ్బుతో.. ప్రభుత్వం సూచించిన 88 రకాల వ్యాపారాల్లో ఏదో ఒకటి ఎంచుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పని చేస్తుంది.
ఉద్యోగిని పధకానికి ఎవరు అర్హులు :
- 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయసు లోపు ఉన్న మహిళలు అందరూ అర్హులే.
- దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా ₹1,50,000 మించకూడదు.
- వైకల్యం ఉన్న వారు లేదా వితంతువులకు వార్షిక కుటుంబ ఆదాయం, వయోపరిమితి లేదు.
- ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే స్త్రీలు తమ క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ బాగా ఉండేలా చూసుకోవాలి.
- గతంలో ఏదైనా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఉన్నట్లయితే లోన్ ఇవ్వరు.
- దరఖాస్తుదారుకి అవసరమైన లోన్ మొత్తం ₹3,00,000 మించకూడదు.
- ఉద్యోగిని రుణంపై ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు.
-
దేశంలో రైతులకు వ్యవసాయ యంత్రాలపై ఉన్న సబ్సిడీలు.. ఏ రాష్ట్రంలో ఎంతంటే?
ఉద్యోగిని పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు..?
- బ్యాంకు ఖాతా పాసు పుస్తకం
- పూర్తి చేసిన దరఖాస్తుతోపాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు జత చేయాలి
- దరఖాస్తు చేస్తున్న మహిళ ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్
- దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు రేషన్ కార్డు కాపీని జతపరచాలి.
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
అవసరమైన అన్ని ధ్రువ పాత్రలతో సమీప బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి .
Share your comments