ఈ ఏడాది విడుదల చేసిన బడ్జెట్లో కేంద్రం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది అని చెప్పవచ్చు. ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు మొత్తం రూ. 1.52 లక్షల కోట్లు నిధులు కేటాయించినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి లో ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూనే కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు. 2024-25 బడ్జెట్లో వ్యవసాయదారులకు కేంద్రం అందిస్తున్న లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పరిశోధనలకు ప్రోత్సహం:
వ్యవసాయ పురోగతికి పరిశోధనలు కీలకమైన భూమిక పోషిస్తాయి. వాతావరణం వేగంగా మార్పు చెందుతుంది, ప్రతికూల వాతావరణం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తుంది. మారుతున్న వాతావరణానికి అనుకూలంగా వ్యవసాయంలో మార్పులు చెయ్యడానికి పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) శాత్రవేత్తలు కేంద్రానికి నివేదికలు అందించగా, ఇందుకు తగ్గట్టుగానే కేంద్రం ఈ సారి బడ్జెట్ ద్వారా పరిశోధనలకు నిధులును అందచేయనున్నారు. పత్రికుల వాతావరణాన్ని తట్టుకొని అధిక ఉత్పాదకతనిచే సరికొత్త వంగడాలను అభివృద్ధి చేసే దిశగా ప్రోత్సహిస్తామని నిర్మల సీతారామన్ తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవసాయ నిపుణులు ఈ పరిశోధనలను పర్యవేక్షించనున్నారు.
10వేల సేంద్రియ ఎరువుల కేంద్రాల ఏర్పాటు:
దేశంలో ప్రకృతి వ్యవసాయం వేగంగా విస్తరిస్తుంది. ఎంతోమంది ఔత్త్సహికులైన రైతులు ప్రకృతి వ్యవసాయం చెయ్యడానికి ఆశక్తి చూపుతున్నారు. అయితే ప్రకృతి చెయ్యడానికి అవసరమైన ఎరువులు మరియు ఇతర ఇన్పుట్లు రైతులకు అందుబాటులో లేవు. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా కోటిమంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని నిర్ణయించారు, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వీలుగా, వీరికి సర్టిఫికేషన్ మరియు బ్రాండింగ్ కూడా కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రీయ సంస్థలు మరియు గ్రామపంచాతీలు ద్వారా అమలుచెయ్యనున్నారు. దేశవ్యాప్తంగా 10 వేల బయో-ఇన్పుట్ రిసోర్స్ (సేంద్రియ ఎరువుల కేంద్రాలు), స్థాపించబోతున్నారు.
స్టేర్ట్-అప్, సహకార సంఘాలకు ప్రోత్సహం:
ఈ ఏడాది బడ్జెట్ ద్వారా రైతు సహకార సంఘాలను ప్రోత్సహించి, వీటి అభివృద్ధికి కృషి చెయ్యనున్నారు. అధిక వినియోగ కేంద్రాలకు సమీపంలో భారీ స్థాయిలో కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లు అభివృద్ధి చెయ్యనున్నారు. కూరగాయ కొనుగోలు,నిల్వ, మార్కెటింగ్ సామర్ధ్యాలు పెంచి, కూరగాయల సరఫరా వ్యవస్థను పెంచేందుకు సహకార సంఘాలు మరియు స్టార్ట్-అప్ లకు ప్రోత్సహం అందించనున్నారు.
పప్పు దినుసులు మరియు నూనెగింజల్లో స్వయం సంవృద్ధి:
గత కొన్ని సంవత్సరాల నుండి దేశంలో నూనెగింజలు మరియు పప్పుదినుసుల దిగుబడిలో తగ్గుదల కనిపిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాగు విస్తీర్ణం తగ్గిపోయావడం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటి ఉత్పత్తిని పెంచి స్వయంసంవృద్ధి సాధించే విధంగా కేంద్రం అడుగులు వేస్తుంది. మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్న విధంగా వేరుశెనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, తదితర నూనె గింజలకు ఆత్మనిర్భరత కోసం ప్రత్యేకంగా ఒక వ్యూహం రూపొందించనున్నారు.
డిజిటల్ క్రాప సర్వే:
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాలో డిజిటల్ క్రాప సర్వే ప్రారంభించింది, ఇది విజయవంతం కావడంతో, వచ్చే మూడేళ్ళలో దేశవ్యాప్తంగా రైతులు, వారి భూముల కోసం వ్యవసాయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) ఏర్పాటు చెయ్యనున్నారు. దీని ద్వారా ఈ ఏడాదిలో 400 జిల్లాల్లో డిజిటల్ సర్వే నిర్వహించి, 6 కోట్ల మంది రైతుల భూముల వివరాలను రైతు, భూమి రిజిస్ట్రీలో పొందుపరచనున్నారు. అంతేకాకుండా ఐదు రాష్ట్రాల్లో జన సామర్ద్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులు జారీచేయనున్నారు.
రొయ్యల ఉత్పత్తి మరియు ఎగుమతి:
రొయ్యల సాగు అనగానే అందరికి గుర్తొచ్చేవి ఆంధ్ర ప్రదేశ్ లోని గోదావరి జిల్లాలు. ఇక్కడి నుండి ప్రతి ఏడాది టన్నుల్లో రొయ్యలు విదేశాలకు ఎగుమతి చెయ్యబడుతున్నాయి. దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాల్లో రొయ్యల సాగు విరివిగా సాగుతుంది. ఈ సారి బడ్జెట్ ద్వారా రొయ్యల సాగు మరియు ఎగుమతికి అనుకూలంగా రొయ్యల సాగు నెట్వర్క్ కేంద్రాల ఏర్పాటుకు ఆర్ధిక సహకారం అందించనున్నారు. నాబార్డ్ ద్వారా రొయ్యల సాగు, శుద్ధి, మరియు ఎగుమతి కోసం నిధులు అందించనున్నారు.
జీవవైవిధ్యం మరియు భూసారం పెంపు:
అధికంగా వినియోగిస్తున్న రసాయన ఎరువుల వలన భూసారం మరియు భూవైవిధ్యం దెబ్బతింటుంది. రసాయ ఎరువులు మరియు క్రిమిసంహారకాల వినియోగం తగ్గించడానికి సుస్థిర వ్యవసాయ పద్దతులను పాటించడం తప్పనిసరి. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులను సుస్థిర వ్యవసాయ పద్దతులు పాటించేవిధంగా ప్రోత్సహిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో భాగమైన ప్రకృతి వ్యవసాయం భూసారాన్ని పెంచడమే కాకుండా జీవవైవిధ్యాన్ని దోహదపడుతుంది. దీని ద్వారా రైతులకు ఖర్చులు తగ్గి, అధిక లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.
Share your comments