Horticulture

భారత దేశంలో వక్క సాగు ఎలా చేస్తారో తెలుసుకుందాం......

KJ Staff
KJ Staff


భోజనం చేసాక తినే కిల్లి దగ్గరనుండి, అతిధులకు ఇచ్చే తాంబులం వరకు అన్నిటికి వక్క అవసరం ఉంటుంది. సాంప్రదాయ అవసరాలకు మరియు అనేక ఆచార సంభంధమైన కార్యక్రమాల్లో వక్కకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలో వక్క ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది అంతేకాకుండా దీనిని అధికంగా వినియోగించేది కూడా భారతీయులే. అయితే ఈ వక్క ఎక్కడ మరియు ఎలా ఉత్పత్తి చేస్తారన్న ప్రశ్న అందరి మదిలో మెదిలే ఉంటుంది. దానికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.

వక్కను అరికనట్ అనే చెట్టు నుండి సేకరిస్తారు, ఇది ఒక పామ్ ట్రీ అంటే, ఈ మొక్కలు కూడా చూడటానికి పామ్ ఆయిల్ చెట్ల లాగానే ఉంటాయి. భారత దేశంలోని కేరళ, కర్ణాటక మరియు అస్సాం ప్రాంతాల్లో వీటిని ఎక్కువుగా సాగుచేస్తారు, అలాగే బాంగ్లాదేశ్ మరియు శ్రీలంక ప్రాంతాల్లో కూడా వీటిని సాగుచేస్తారు. ఒక్క భారత దేశంలోనే సుమారు రెండు లక్షల ఎకరాల్లో వక్క సాగు జరుగుతుంది, దీని నుండి ప్రతి ఏటా 2.28 లక్షల టన్నుల వక్క ఉట్పతై దేశమంతటా రవాణా జరుగుతుంది. ఏదైనా పంట నుండి మంచి దిగుబడి పొందాలంటే నాణ్యమైన రకాలను ఎంపిక చేసుకోవడం ముఖ్యం, వక్కలో కూడా ఎన్నో ప్రామాణికమైన రకాలు అందుబాటులో ఉన్నాయి వాటిలో, మంగళ, సుమంగళ, శుభమంగళ, మోహితానగర, శ్రీమంగళ, సమృతి, మొదలైన రకాలు వివిధ ప్రాంతాల్లో సాగుకు అనువుగా ఉంటాయి.

వక్కకు ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటంటే, ఇది దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సులభంగా పెరుగుతుంది, అయితే ఆమ్లా, క్షార మరియు నీరు నిలువ ఉండే నేలలు మొక్కల సాగుకు అనుకూలంగా ఉండవు. మరొక్క ప్రత్యేకత ఏమిటంటే 4℃ ఉష్ణోగ్రత నుండి 40 ℃ ఉష్ణోగ్రత వరకు తట్టుకొని నిలబడగలదు. సముద్ర మట్టానికి సుమారు 1000 మీటర్ల ఎత్తు ఉన్న ప్రాంతాల వరకు సాగుకు అనుకూలం. వర్షాధారితంగా పెంచే ప్రాంతాల్లో ఏడాదికి 750 నుండి 4500 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు అనుకూలం. జూన్ నుండి డిసెంబర్ మధ్య కాలం మొక్కలు నాటుకునేందుకు అనుకూలం. ప్రధాన పొలంలో 1 నుండి 2 రెండు సంవత్సరాల మధ్య వయసుగల మొక్కలను ఎంచుకోవాలి. ఈ నారు మొక్కలను షేడ్ నెట్ల కింద పెంచడం ఉత్తమం. ప్రధాన పొలంలో మొక్కలు నాటుకోవడానికి ముందు పొలం మొత్తం దీని చదును చేసుకోవాలి. ప్రతి మొక్కకు మధ్య 2.75 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి, దీనివలన అంతకృషి సులభంగా ఉంటుంది.

మొక్కలు ఎదిగే సమయంలో సమగ్ర నీటి యాజమాన్య చర్యలు అత్యంత కీలకం. మట్టిలోని తేమ ఆధారితంగా నీటిని అందించాలి, నీటిని డ్రిప్ ద్వారా లేదంటే బోదెల ద్వారా అందించాలి, డ్రిప్ సిస్టం ఏర్పాటు చేసుకోవడానికి ఉద్యాన శాఖ వారు అందిస్తున్న సబ్సిడీలను వినియోగించుకోవాలి. శీతాకాలంలో వారానికి ఒకసారిని నీరు అందిస్తే సరిపోతుంది, కానీ వేసవి కాలంలో మాత్రం మట్టిలోని తేమ ఆధారంగా వారానికి రెండు నుండి మూడు సార్లు నీటిని అందించాలి, లేదంటే మొక్కలు ఒత్తిడికి గురై దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రధాన పొలంలో మొక్కలు నాటిన తరువాత తరచూ కలుపు మొక్కలను తొలగిస్తూ ఉండాలి, దీని కోసం మొక్కలు మధ్యలో సాలును పోనిస్తే కలుపు మొక్కలు తొలగిపోతాయి.

భారత దేశంలో ఎంతో ప్రాధ్యానత ఉన్న వక్క సాగులో మాత్రం గత కొద్దీ కాలంగా తగ్గుదల కనిపిస్తుంది. కూలీలా కొరత ఏర్పడటం, వాతావరణ మార్పులు, కొత్త రోగాలు మరియు నేల క్షిణించడం మొదలైనవి సాగులో తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు. అయితే రైతులు సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటిస్తూ, వ్యవసాయ యంత్రాలను వినియోగిస్తే, కూలీలా కొరతను అధిగమించడమే కాకుండా పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చు.

Share your comments

Subscribe Magazine