అరటి ఉత్పత్తిని తగ్గించే నులి పురుగుల మరియు పేనుబంకను ఎదుర్కోవడానికి తీసుకొనే నివారణ చర్యల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నులి పురుగు(Burrowing Nematode):
దీని యొక్క యొక్క మొదటి లక్షణం చెట్టు కింది భాగంలో మచ్చ ఏర్పడుతుంది. నులి పురుగులు వేరు విభాగంలో గుడ్లను పెడుతుంది.
గుడ్లు పొదిగిన తర్వాత లార్వా వేరు బీగాన్ని తినడం మొదలు పెడుతాయి. ఇలా దెబ్బతిన్న భాగాన్ని శిలీంధ్రాలు వేగంగా దాడి చేస్తాయి
అరటి గెలలో పండ్ల సంఖ్య తగ్గిపోతుంది మరియు పండ్లు చిన్నవిగా ఉంటాయి.వీటికి ప్రభావితం అయిన మొక్కలు, ఎరువులకి గాని నీటిపారుదలకి గాని స్పందించవు.
నియంత్రణ : అరటిని నాటే సమయలో కార్బోఫ్యూరాన్ 3G లేదా ఫోరేట్ 10G @10 గ్రా/ వాడాలి. లేదా నాటేటప్పుడు 250-400 గ్రాముల వేపపిండిని వేయడం వల్ల చీడపీడల సంఖ్య తగ్గుతుంది. అరటి రకాలను ఎంచుకొనేటప్పుడు నులి పురుగులను తట్టుకొనే వాటిని ఎంచుకోవాలి.ఇటీవల గ్రాన్యులర్ నెమటిసైడ్లకి ప్రజాదరణ పొందుతోంది.
అరటిలో పేనుబంక:
పేనుబంక ద్వారా అనేక వైరస్ లు అరటి తోటని నాశనం చేస్తాయి. పేనుబంక అరటిలో వచ్చే బంచీ టాప్ వైరస్ కి వాహకంగా ఉంటుంది. ఇవి రసాన్ని పీల్చి మొక్కల నాశనానికి కారణం అవుతాయి. అధిక తేమ శాతం వీటి తాకిడికి అనుకూలంగా ఉంటుంది. పేనుబంక ఎక్కువగా ఆకుల దిగువ బాగాన ఉంటాయి.
నివారణ చర్యలు:
10-15 రోజుల వ్యవధిలో మోనోక్రోటోఫాస్ (0.05%) లేదా మలాథియాన్ (0.1%) పిచికారీ చేయడం వలన పేనుబంకని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇది పునరావృతం కాకుండా నిరోధించడానికి ఫోరేట్ @ 1.0 కిలో/హెక్టారు మొక్కలపై కాకుండా నేలలో వేసుకోవాలి.
మరిన్ని చదవండి.
Share your comments