పూల సాగు ఎల్లపుడు లాభదాయకమే. ప్రస్తుతం, పండగలు మరియు పెళ్లిళ్లతో పూల రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. పూలలో కనకాంబరాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కనకాంబరాలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుండడంతో ఇటీవలకాలంలో రైతులు వీటిని సాగు చేసేందుకు ఆశక్తి చూపుతున్నారు. కనకాంబరాలు ఉష్ణమండల వాతావరణానానికి అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా వాతావరణంలో వచ్చే హెచ్చుతగ్గులను కూడా కనకాంబరాలు తట్టుకొని నిలబడగలవు.
కనకాంబరాలు సాగును తక్కువ విస్తీరణంలో కూడా చేపట్టవచ్చు, కాబట్టి చిన్న మరియు సన్నకారు రైతులు కూడా కనకాంబరాలను సులభంగా సాగు చెయ్యవచ్చు. వీటిని సాగు చేసే రైతులు కూడా మార్కెట్లో మంచి ధర లభించడంతో మంచి లాభాలు పొందుతున్నారు. కనకాంబరాలు సాగు చేపట్టే రైతులు అన్ని యాజమాన్య పద్దతులను పాటిస్తే దాదాపు మూడేళ్లపాటు నికర ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. మొక్కలు సాగు చేపట్టే ముందు రైతులు నీటి ఎద్దడిని తట్టుకునే బహువార్షికా రకాలను ఎంచుకోవాలి, అంతేకాకుండా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాఆంధ్ర జిల్లాలు కనకాంబరాల సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడి ప్రాంతాల్లో అధిక తేమ, వాతావరణ పరిస్థితులు మరియు వాతావరణం సాగుకు అనుకూలిస్తాయి. ఇక్కడి మట్టిలోని నీటి నిల్వలు మరియు నేల రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. కనకాంబరాలను ప్రధాన పంటగా మాత్రమే కాకూండా కొబ్బరి, పామాయిల్, జామ, దానెమ్మ, నారింజ వంటి తోటల్లో అంతర పంటగా కనకాంబరం సాగును చేపట్టి రైతులు అదనపు అదాయాన్ని పొందవచ్చు.
మేలైన యాజమాన్య పద్దతులను పాటిస్తే మొక్కలు నాటిన మూడు సంవత్సరాల్లోనే దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. పూత ప్రారంభమైన తరువాత సంవత్సరం పొడవునా పూలు పూస్తాయి, జూన్ నుండి జనవరి వరకు పూతకు అనుకూలంగా ఉంటుంది, ఈ సమయంలో దిగుబడి కూడా ఎక్కువుగా ఉంటుంది. కనకాంబరం మొగ్గలు పువ్వులుగా విచ్చుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుంది. ఉదయం మరియు సాయంత్రం వేళలు పూలు కోసేందుకు అనుకూలంగా ఉంటాయి. ఈ విధంగా ఏడాదికి 1800 నుండి 2500 కిలోల వరకు దిగుబడి పొందవచ్చు, ప్రస్తుతం మార్కెట్లో కనకాంబరాలకు ఒక కిలో ధర 700-1000 రూపాయిల వరకు పలుకుతుంది.
Share your comments