Horticulture

జెర్బెర సాగుతో అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతులు, ఒక్కసారి నాటితే మూడేళ్ళ వరకు పంట

KJ Staff
KJ Staff

పెళ్లిళ్లు మరియు ఏ ఇతర శుభకార్యాలకైనా అలంకారం చెయ్యాలంటే జెర్బెర పూలు తప్పనిసరి. ఈ పూలకు ఒక్క పెళ్లిళ్ల సీసన్ లోనే కాకుండా అన్ని కాలాల్లోనూ అధిక డిమాండ్ ఉంటుంది. అయితే మార్కెట్లో వీటికున్న డీమాండ్ కి మరియు లబ్యతకి మధ్య ఎంతో వ్యత్యాసం ఉండటం వలన వీటిని ఎల్లప్పుడూ మంచి ధర లభిస్తుంది. వీటిని సాగు చెయ్యడం ద్వారా రైతులు మంచి లాభాలు ఆర్జించవచ్చు.

జెర్బెర పూల సాగు చెయ్యాలంటే ఒక నిర్దిష్టమైన వాతావరణం ఉండాలి. పూల సాగుకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి పోలీ హౌస్ సహాయం చేస్తుంది, పోలీహౌస్ లో జెర్బేరా పూలు సాగు రైతులకు ఇది ఒక కల్పతరువుగా చెప్పవచ్చు. ఇప్పటికే ఎంతోమంది రైతులు ఆధునిక పద్దతుల్లో జెర్బెర పూలను సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. పోలీహౌస్లో సాగు చేపట్టాలంటే ప్రారంభ పెట్టుబడి ఎక్కువుగానే ఉంటుంది, అయితే సంప్రదాయసాగుతో పోలిస్తే దిగుబడి 4-5 రేట్లు ఎక్కువుగా ఉంటుంది, కాబట్టి రైతులు తక్కువ స్థలంలోనే ఎక్కువ దిగుబడి పొందవచ్చు. జెర్బెర పూలను సాగు చేసే రైతులు కొన్ని సమగ్ర యాజమాన్య పాటించవలసి ఉంటుంది, ఈ యాజమాన్య పద్దతులతో రైతులు అధిక లాభాలను మరియు దిగుబడులను పొందవచ్చు. 

జెర్బెర పూలు సాగుకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. మార్కెట్లో సాధారణ పూలతో పాటు అలంకరణ ఫూలకు కూడా గిరాకీ పెరగడంతో రైతులు కట్ ఫ్లవర్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం పోలీహౌస్లోని సాంకేతిక పరిజ్ఞానంతో, పోలీహౌస్ లోపలి వాతావరణాన్ని జెర్బెర పూల సాగుకు అనుకూలంగా నియంత్రిస్తూ, తక్కువ విస్తీరణంలోనే రైతులు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. పోలీహౌస్ సాగు ద్వారా మరొక్క ప్రయోజనం ఏమిటంటే, పంటలను పట్టి పీడించే ఎన్నో రకాల చీడపీడలను సులభంగా నియంత్రించవచ్చు. అంతేకాకుండా కాలానికి ముందుగా నాటుకొని, వాటిని పెంచి, మార్కెట్లో జెర్బెర పూలకు మంచి గిరాకీ ఉన్న సమయంలో వీటిని విక్రయించవచ్చు. జెర్బెర పూలను ఒకసారి నాటితే కనీసం మూడు సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. అధిక దిగుబడులతోపాటు, నాణ్యమైన పంటలు పొందడానికి రైతులు సకాలంలో మెరుగైన యాజమాన్య పద్దతులు పాటించవలసి ఉంటుంది.

సాగుకు ముఖ్యమైన సూచనలు:
ఏ పంటల సాగుకైనా సరే తగిన మొత్తంలో పోషకాలను అందించడం తప్పనిసరి, జెర్బెర పూల సాగుకు కుడి సరైన పరిమాణంలో పోషకాలను అందించాలి. మొక్క ఎదుగుదలకు స్థూలపోషకాలతోపాటు, సూక్ష్మపోషకాలను కూడా అందించాలి, ఇందుకోసం మట్టిని పరీక్షించి, అవసరమైన పోషకాలను డ్రిప్ పద్దతి ద్వారా అందించాలి. ఇందుకోసం నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ పద్దతి ద్వారా అందించాలి. 

పోలీహౌస్ లో సరైన యజమాన్య పద్దతులను పాటించకుంటే, చీడపీడల సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది రైతులు అవగాహనా లేక ఎరువులతో పాటు పురుగుమందులను కూడా కలిపి పిచికారీ చేస్తారు, ఇలా చెయ్యడం ద్వారా సంపూర్ణంగా పురుగులను నియంత్రించడం కష్టమవుతుంది. రైతులు రసాయన పురుగుమందులతో పాటు వేపనూనె మరియు ఇతర సేంద్రియ పురుగుమందులను వాడటం ద్వారా పురుగులను సంగ్రవంతగా నివారించడానికి వీలుంటుంది.

జెర్బెర పూలను మార్కెట్లో విక్రయించాలన్న, లేదా విదేశాలకు ఎగుమతి చెయ్యాలన్న సరే పూలు నాణ్యమైనవై ఉండాలి. నాణ్యమైన దిగుబడులు పొందాలంటే మొక్క ఎదుగుదలకు అవసరమైన నీరు పోషకాలు, మరియు వాతావరణ పరిస్థితులను కల్పించాలి. కొంతమంది రైతులు మార్కెట్ లేని సమయంలో పూలను కొయ్యకుండా అలాగే వదిలేస్తారు, దీనివలన పూలు కుళ్లిపోయి ఫంగస్ ఏర్పడుతుంది, కాబట్టి మార్కెట్ లేని సమయలో కూడా పూలను కోసి బయట పడెయ్యడం ద్వారా మొక్కలను ఫంగస్ తెగుళ్ల నుండి కాపాడుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine