పుదీనా ఇంగ్లీషులో మింట్ అని పిలవబడే ఈ మొక్క దాదాపు అందరికి సుపరిచితమే. మంచి సువాసనతో, ఘాటు రుచి కలిగిన ఈ మొక్క ఆకులను అనేక రకాల వంటకాల్లో, చాక్లేట్లా తయారీలో వాడుతుంటారు. పుదీనా మొక్క నుండి సేకరించిన ఆయిల్ చాల ఖరీదయినది. ఈ ఆయిల్ ను పెర్ఫ్యూమ్, టూత్ పేస్ట్, మరియు పిప్పెర్ మింట్ చాక్లేట్లా తయారీలో వాడతారు. ఈ పంటను ప్రధాన పంటగా కానీ అంతరపంటగా కానీ సాగు చేసందుకు విలువుంటుంది. పుదీనా పంటను సాగు చేసి, ఆకురాలేగాం లేదా ఆయిల్ సేకరణకు ఇలా రెండు విధాలుగా వాడుకోవచ్చు. అంతే కాకుండా ఇంటి పెరట్లోను అలాగే మేడ పైన కూడా పుదినాను పెంచుకోవచ్చు.
పుదీనా రకాలు: పుదీనాలో మూడు ప్రధాన జాతులకు చెందిన రకాలు ఉన్నాయ్. జాపనీస్ మింట్, పిప్పెర్ మింట్, మరియు స్పియర్ మింట్ . వీటిలో స్పియర్ మింట్ ను మనం పుదీనా అని పిలుస్తాం. జాపనీస్ మింట్ మింట్ ఆయిల్ కోసం పెంచ్చుతార. పుదీనాని ఎక్కువగా ఇండియా, చైనా, బ్రెజిల్ తో పటు థాయిలాండ్, వియత్నాం వంటి దేశాల్లో సాగుచేస్తుంటారు. మన దేశంలో సాగు చేసే రకాల్లో MAS- 1, హైబ్రిడ్-77, శివాలిక్, గోమతి, హిమాలయ, కుషాల్, వంటివి ప్రధానమైన రకాలు.
మొక్క ఎదుగుదలకు అనువైన వాతావరణం: పుదీనా మొక్క ఉష్ణ మండలాల్లో ఎక్కువుగా పెరుగుతుంది. మొక్క ఎదుగుదలకు 100-110 cm వర్షపాతం అవసరం. 20-40 సెంటిగ్రేడ్ల వేడిని తట్టుకొని నిలబడగలదు. ఈ మొక్క లొమ్ నెలల్లో పెరిగేందుకు అనువుగా ఉంటుంది. బంక మట్టి నేలలు పుదీనా సాగుకు పనికిరావు.
మొక్కలు నాటడం: మొక్కల్ని నాటేముందు భూమిని రెండు సార్లు కలియ దున్నుకోవాలి. రెండొవ దుక్కులో, ఒక ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువుని వేసి కలియదున్నుకోవాలి. పుదినాను నాటేందుకు, పిలకలను, జనవరి మరియు ఫిబ్రవరి మాసాల్లో నాటుకోవాల్సిఉంటుంది. ప్రతి మొక్కకు మధ్య 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరాన్ని ఉండెల నాటుకోవాలి. మట్టిలోని తేమనుబట్టి ప్రతీ 12 రోజులకు నీటిని అందించడం మంచింది. ఇంకా ఎరువుల విషయానికి వస్తే ఒక ఎకరానికి 60 కేజీ నత్రజని, 30 కేజీల భాస్ఫారమ్, 20 కేజీల పోటాష్ అందించాలి. 25 కేజీల నత్రజనితో పాటు, భాస్ఫారమ్ మరియు పోటాష్ భూమి చివరి దుక్కులో మట్టిలో కలిపి కలియ దున్నుకోవాలి, మిగిలిన నత్రజని మొదటి కోత కోసిన తరువాత అందించాలి.
హార్వెస్టింగ్: పుదీనా సాగు ద్వారా రెండు సార్లవరకు దిగుబడిని పొందవచ్చు. మొక్క నాటిన 100-120 రోజుల తరవత ఒకసారి, మొదటి సాగు తర్వాత 80-90 రోజులకు ఇంకోసారి దిగుబడి వస్తుంది. ఆయిల్ కోసం మొక్కలు పెంచేవాళ్ళు, ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో కోత కొయ్యాలి. వర్షాకాలంలో ఆయిల్ దిగుబడి తక్కువుగా ఉంటుంది. స్టీమ్ డిస్టిలేషన్ పద్ధతి ద్వారా పుదీనా మొక్కల నుండి నూనెను వేరుచేసి నిల్వ చేసుకోవాలి.
Share your comments