ఇండియాలో చాలాచోట్ల మామిడి పంటలు రైతులు పండిస్తూ ఉంటారు. మామిడి పంట పండిస్తే బాగానే దిగుబడి వస్తుంది. కానీ ఆకాల వర్షాలు, ఈదురుగాలులు వీసినప్పుడు పంటకు నష్టం జరుగుతూ ఉంటుంది. పెద్దగా ఈదురుగాలులు వీసినప్పుడు పండ్లు రాలిపోతాయి. ఇక మిగతా పంటలలాగే తెగులు బారి నుంచి మామిడి పంటను కాపాడుకోవాల్సి ఉంటుంది. నీళ్లు ఎప్పటికప్పుడు అందించాల్సి ఉంటుంది. రైతులకు బాగా లాభదాయకమైన పంట మామిడి. తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది రైతులు మామిడి పంట పండిస్తున్నారు.
ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే.. ఎక్కడ బట్టినా మామిడి పండ్లు కనిపిస్తాయి. రోడ్లపై బండుల మీద పెట్టి నిగనిగలాడే మామిడి పండ్లు విక్రయిస్తూ ఉంటారు. వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. బంగినిపల్లె మామిడి పండ్లు అయితే చాలా రుచిగా ఉంటాయి. అందుకే వీటిని తినేందుకు చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక పచ్చి మామిడి పండ్లు కూడా చాలా రుచిగా ఉంటాయి.
అయితే పంజాబ్‌లోని జలంధర్‌లోని మాలియా హోతీ గ్రామంలోని రైతులు టొమ్మీ అట్కిన్స్ జాతి మామిడి పండ్లను పండిస్తున్నారు. ఈ జాతి మామిడి పండ్లను అమెరికాలో ఎక్కువగా పండిస్తారు. పర్పుల్ రంగులో ఈ మామిడి పండ్లు ఉంటాయి. ప్రపంచమంతా వీటికి బాగా డిమాండ్ ఉండటంతో.. హాతీ గ్రామానికి చెందిన రైతులు వీటిని ఇండియాలో పండిస్తున్నారు. ఇవి మిగతా మామిడి పండ్ల కంటే 75 శాతం తక్కువ తీపితో ఇవి ఉంటాయి. దీంతో డయాబెటిస్ పేషెంట్లు కూడా వీటిని తినవచ్చు.
సేంద్రీయ పద్దతిలో వీటిని పంజాబ్‌లోని రైతులు పండిస్తున్నారు. దూరం నుంచి ఈ మామిడి పండ్లను చూస్తే వంకాయలలాగా కనిపిస్తాయి. దగ్గరికి వెళ్లి చూస్తేనే మామిడి పండు అని అర్థమవుతుంది. ఈ మామిడి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి మేలు చేస్తుంది. అలాగే శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది.
షుగర్ పేషెంట్స్ ఎక్కువగా వీటిని తింటూ ఉంటారు. ఇండియాలో వీటికి చాలా తక్కువమంది తింటారు. కానీ అమెరికాలో వీటికి మంచి డిమాండ్ ఉంది. పంజాబ్ రైతులు మిగతా జాతి మామిడి పండ్లతో పాటు వీటిని కూడా కొంతమేర పండిస్తున్నారు.
Share your comments