Horticulture

పెరటి చేపల పెంపకం ఎలా?.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

KJ Staff
KJ Staff
fish
fish

సిటీలలో చాలామంది ఇళ్లల్లో కుక్కులు, పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. పల్లెటూళ్లల్లో అయితే కోళ్లను, బాతులు లాంటివి పెంచుకుంటూ ఉంటారు. అయితే మన ఇంట్లో చేపలను కూడా పెంచుకోవచ్చు. అంతేకాదు దీని ద్వారా బోల్డెండ ఆదాయం కూడా పొందవచ్చు. చేపల పెంపకం ద్వారా ఇంటి పరిసరాలు ఆహ్వాదకరంగా ఉండటంతో పాటు ప్రశాంత వాతావరణం ఉంటుంది. అప్పుడప్పుడు అక్కడే సేద తీరవచ్చు. హాయిగా గడపవచ్చు.

సిటీలు, టౌన్లలో చాలామంది చేపల అక్వేరియం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు. ఇంట్లో చూడటానికి అందంగా ఉంటుందని ఇలా చేస్తారు. కానీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఖాళీ స్థలాల్లోనే చేపలను పెంచుకోవడం ద్వారా మరింత అందంగా ఉంటుంది. దీని వల్ల ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు. అసలు పెరటి చేపల పెంపకం ఎలా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది ఇంటి పెరట్లో పూల మొక్కలు, కూరగాయలు పెంచుకుంటూ ఉంటారు. అలాగే చిన్నపాటి చెరువు ఏర్పాటు చేసుకుని చేపలు కూడా పెంచుకోవచ్చు. పెరట్లోనే కాదు.. మీ ఇంటి మేడపై కూడా చేపలు పెంచుకోవచ్చు.

ఇంట్లో కోలను ఇలా తవ్వుకోవాలి

కనీస లోతు 1-1.5 మీ ఉండాలి. 10-15 సెం.మీ పొడవు గల ఒక చేపకు కనీసం 50 లీటర్ల నీరు ఉండాలి.

ధ్వనించే ప్రదేశాలు , రహదారుల నుండి దూరంగా ఉండాలి.

చెట్ల నీడ ఉండాలి. కానీ చెట్ల కింద గుంత ఉండకూడదు. ఎందుకంటే పడిపోయే ఆకులు నీటిని కలుషితం చేస్తాయి.

లోతట్టు ప్రాంతాలలో ఉండకూడదు, ఎందుకంటే వర్షపునీటిని ప్రవహించడం ద్వారా కలుషితమయ్యే ప్రమాదం ఉంది.

చెరువు నిర్మించడానికి మీకు ఇది అవసరం

పిండిచేసిన రాయి,
ఇసుక,
సిమెంట్,
3-4 మిమీ వ్యాసం, 30x30 సెం.మీ. కణంతో ఉపబల మెష్,
బోర్డుల నుండి ఫార్మ్‌వర్క్,
దిగువ మరియు గోడలను వాటర్ఫ్రూఫింగ్ చేయడానికి రూఫింగ్ భావించారు లేదా ఇతర పదార్థాలు,
ఇన్లెట్ మరియు అవుట్లెట్ ఓపెనింగ్స్ కోసం పైపులు,
దిగువ మరియు గోడలను ప్లాస్టరింగ్ చేయడానికి వాటర్ఫ్రూఫింగ్ సంకలితం.

చేపట్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఏ రకం చేపనైనా పెంచుకోవచ్చు. మార్కెట్ లో చేపల మేత దొరుకుతుంది. చేపలకు పొద్దన, సాయంత్రం అది వేయాలి. 

Related Topics

Fish, Home, Details

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More