Horticulture

పశువుల బీమా పథకం గురించి తెలుసా?.. ఎలా అప్లై చేసుకోవాలి?

KJ Staff
KJ Staff
Bufellows insurence
Bufellows insurence

బీమా అనగానే మనకు ఎల్ఐసీ వాళ్లు అందించే బీమా, హెల్త్ ఇన్యూరెన్స్ లాంటివి గుర్తుకొస్తాయి. అయితే ఇవే కాదు.. బీమాలో అనేక రకాలు ఉన్నాయి. రైతుల కోసమే ఇప్పుడు ప్రత్యేకంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనేక బీమా పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వీటి ద్వారా రైతలుకు భద్రత కల్పిస్తున్నాయి. ముఖ్యంగా రైతుల కోసమే ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన బీమా పథకాల్లో రైతు బీమా, పంట బీమా అనే రెండు ఉన్నాయి. రైతు బీమా అంటే రైతుకు ఇన్యూరెన్స్ కల్పిస్తారు. ఒకవేళ ప్రమాదవశాత్తూ రైతు చనిపోతే వారి కుటుంబానికి డబ్బులు వస్తాయి.

కొన్ని రాష్ట్రాలు ఉచితంగా రైతులకు బీమా సదుపాయం కల్పిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు బీమా కల్పిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రైతులు సగం ప్రీమియం చెల్లిస్తే.. మిగతా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. ఇక పంట బీమా విషయానికొస్తే.. ఆకాల వర్షం, వరదలు, వాతావరణంలో మార్పులు వల్ల రైతులకు పంటకు నష్టం జరిగినప్పుడు పంట బామా ద్వారా పరిహారం చెల్లిస్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాలు అందిస్తున్నాయి. కేంద్రమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా పంట నష్టపోయినప్పుడు రైతులకు కేంద్ర ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి పథకాలను అందిస్తున్నాయి. ఏపీలో వైఎస్సార్ పంట బీమా పథకం ద్వారా ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. ఇటీవల పంట నష్టపోయిన రైతలుకు సీఎం జగన్ నగదు అకౌంట్లో జమ చేశారు.

అయితే రైతుకు, రైతుల పంటలకే కాదు.. రైతులు, పంటలకే కాదు రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా చేపడతారు. రైతులకు ప్రత్నామ్యాయ ఆదాయ మార్గం పశుపోషణ ఉంది. ఒకవేళ పశువులకు ఏమైనా జరిగితే రైతుకు ఆర్థిక నష్టం జరుగుతుంది. దీంతో పశువులకు కూడా కేంద్ర ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరే పశువుల బీమా పథకం. ఈ పథకం అర్హతలు ఏంటి.. ఎలా వస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం.

దేశీయ, క్రాస్, బ్రిడ్ జాతులకు చెందిన పశువులకు బీమా అందిస్తారు.
పాడి ఆవులు, గేదెలు, దూడలు, పడ్డలు, ఎడ్లకు బీమా సదుపాయం ఉంది. ఈ బీమా తీసుకోవాలంటే పశువు పశువు అప్పటి మార్కెట్ విలువ మొత్తానికి ఏడాది 4 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రీమియం చెల్లిస్తే.. పశువు ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు బీమా చేసే సమయంలో సంబంధిత పశువు మార్కెట్ విలువ ఎంతైతే ఉందో అంత మొతాన్ని పరిహారంగా ఇస్తారు. పాలు ఇవ్వని పశువులకు మాత్రం మార్కెట్ విలువలో 75 శాతాన్ని పరిహారంగా ఇస్తారు. మార్కెట్ విలువను రైతు, పశువైద్య అధికారి, బీమా కంపెనీల యాజమాన్యం సమక్షంలో నిర్ణయించబడుతుంది.

బీమా నిబంధనలు ఇవే

అగ్ని ప్రమాదం, వరదలు, తుపానులు, భూకంపం లాంటి ప్రమాదాల వల్ల చనిపోయిన పశువులకు బీమా పరిహారం వస్తుంది.
ఇక వివిధ రకాల వ్యాధులు, సర్జరీ చేసే సమయంలో పశువులు చనిపోతే బీమా అందుతుంది.

ఎలాంటి పత్రాలు కావాలి


పశువైద్యుడు ధృవీకరించిన పశువు ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే పత్రం
వయస్సు
ఆరోగ్య పరమైన వివరాలు
మార్కెట్ విలువ
గుర్తింపు మచ్చలు

 

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More