Horticulture

క్యారెట్ సాగులో కనిపించే తెగుళ్లు...వాటి నివారణ చర్యలు....

KJ Staff
KJ Staff

ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో క్యారెట్ ఒకటి, భూమిలో పెరిగే ఈ కూరగాయకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్ కి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే క్యారెట్ పంట సాగు చెయ్యాలంటే ఉష్ణోగ్రత తక్కువుగా ఉండాలి. వీటిని ఎక్కువుగా శీతాకాలంలో పండిస్తారు. క్యారెట్ సాగు చేసే రైతులు తెగుళ్ల వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెగుళ్లు సోకడం వలన దిగుబడి తగ్గిపోవడంతో పాటు, నాణ్యత కూడా తగ్గిపోతుంది. దీనివలన పంటకు సరైన ధర దొరక్క రైతులు పెట్టుబడి కూడా కోల్పవడం జరుగుతుంది.

క్యారెట్ సాగు చేసే రైతులు తెగుళ్ల నివారణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తెగుళ్లను ముందే గుర్తించి వాటిని నిర్ములించాలి, లేకుంటే తెగుళ్లు పంట మొత్తం వ్యాపించి రైతులకు తీవ్రమైన నష్టాన్ని మిగులుస్తాయి. క్యారెట్ మొక్కలకు ఎక్కువుగా వచ్చే తెగుళ్లలో ఆకుముడత తెగులు ఒకటి, ఇది ఓమిసైట్సు పైథియం వయోలే అనే శిలింద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది. వెచ్చని తేమతో కూడిన ప్రదేశాలు ఈ వ్యాధి వ్యాప్తికి అనుకూలం. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు ముడుచుకుపోయినట్లు కనిపిస్తాయి, దీనితోపాటు ప్రధాన దుంప కుహూర భాగంలో మచ్చలు ఏర్పడి అవి గాయాలుగా మారతాయి. దుంపపై గాయాలు ఏర్పడి అవి మార్కెట్ చెయ్యడానికి పనికిరావు. అలాగే బాక్టీరియా మచ్చ తెగులు ద్వారా కూడా క్యారెట్లో నష్టం ఏర్పడుతుంది. ఈ బాక్టీరియా ఆశించిన మొక్కలు, ఆకులు పై పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపి గోధుమ రంగులోకి మారి, ఆకులు ముడుచుకుపోయి చనిపోతాయి. దీనివలన క్యారెట్లో ఎదుగుదల లోపిస్తుంది.

క్యారెట్ చలి ప్రాంతాల్లో సాగు చేసే పంట, దీనిని సాగు చెయ్యడానికి ఇసుక నేలలు అనుకూలం, బంక నేలలు సాగుకు అనుకూలంగా ఉండవు. బంక నేలల్లో సాగుచేస్తే దుంప సర్రిగా ఎదగదని గుర్తుపెట్టుకోవాలి. క్యారెట్లో వచ్చే తెగుళ్లను నివారించడానికి విత్తనశుద్ధి తప్పనిసరి. ఒక ఎకరం విస్తీరణంలో సాగు చెయ్యడానికి 2 కేజీల విత్తనం అవసరం ఉంటుంది. విత్తనం నాటే ముందు విత్తనాన్ని వేడి నీటితో శుద్ధి చెయ్యాలి. తరువాత ఒక కేజీ విత్తనానికి 5మి.లి ఇమిడాక్లోరోఫిడ్, 3 గ్రాముల థైరమ్ కలిపి విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. ఇలా చెయ్యడం ద్వారా విత్తనంలోని చీడపీడలు తొలగిపోవడంతో పాటు మొక్క ఎగిగే సమయంలో ఎటువంటి చీడపీడలు ఆశించవు.

క్యారెట్ సాగులో సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువుగా కనిపిస్తుంది, కాబట్టి మొక్కకు అవసరమైన పోషకాలను అందించాలి. సూక్ష్మపోషకాల లోపం సరిచేసేందుకు ఫార్ములా 6 అనే పోషకాల కలయికను 4 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో మొక్కలపై పిచికారీ చెయ్యాలి. శిలింద్రలతో పాటు పురుగులు కూడా క్యారెట్లో ఎక్కువ నష్టం కలిగిస్తాయి, వీటిలో క్యారెట్ ఫ్లస్ అనే పురుగు మొదట మొక్కల ఆకులను ఆశించి క్రమంగా కాండం భాగంలోకి చేరి ఎంతో నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు ఆశించిన దుంపలు కుళ్లిపోయి మార్కెట్ చెయ్యడానికి పనికి రావు. దీని నివారించడానికి మలాథియాన్ 2మీ.లి ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. విత్తిన 20 రోజుల తరువాత 2 మి.లి మలాథియాన్, 3 గ్రాముల సల్ఫర్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. క్యారెట్ పంట కేవలం 80-90 రోజుల్లోనే చేతికి వస్తుంది, యాజమాన్య పద్దతులు అన్ని సర్రిగా పాటిస్తే మంచి నాణ్యమైన పంటను పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine