ఆకుకూరల్లో మంచి సువాసాలను వెదజల్లే పంటలు ఏమిటంటే వెంటనే మనకు గుర్తొచ్చే పేరు పుదీనా. పుదీనాను ఆకుకూరగా మాత్రమే కాకుండా ఎన్నో విధాలుగా విక్రయించుకోవచ్చు. అయితే పుదీనాలో ఎన్నో రకాలు ఉన్నాయి, వాటిలో జాపనీస్ మింట్ ఒకటి. ఈ జాపనీస్ పుదీనా ఆకుల నుండి సేకరించే, నూనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నూనె నుండి సబ్బులు, సుగంధ ద్రవ్యాలు, మరియు సౌందర్యా సాధనాల్లో కూడా వినియోగిస్తారు. ఈ నూనె నుండి మెడిసిన్స్ కూడా తయారుచెయ్యడం విశేషం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ జాపనీస్ మింట్ నూనెకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది.
సాంప్రదాయ పంటలు కాకుండా, కొత్త రకం పంటలు సాగు చెయ్యాలనుకునే వారికి జాపనీస్ పుదీనా సాగు కల్పతరువు వంటిదని చెప్పవచ్చు. ఈ జాపనీస్ మింట్ సాగుకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణం అనుకూలిస్తుంది, దీనితో ఇప్పటికే ఎంతోమంది రైతులు దీనిని సాగు చేస్తూ మంచి దిగుబడి పొందుతున్నారు. ఇప్పటికే చాలా ఎంతోమంది రైతులు సిట్రోనెల్ల, పామారోజా, నిమ్మగడ్డి వంటివి సాగు చేసి, వాటి నుండి సేకరించిన నూనెను విక్రయిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. జాపనీస్ మింట్ కూడా ఈ త్రోవలోకే వస్తుంది. తక్కువ ఖర్చు మరియు శ్రమతో, తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పంట ఇది.
జాపనీస్ మింట్ లో కోసి రకానికి చెందిన వంగడం రైతులకు అందుబాటులో ఉంది. దీని నుండి సేకరించిన నూనెకు, కేవలం మన దేశంలోనే కాకుండా ఆంతర్జాతీయా మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని అనేక రకాల సౌందర్యా సాధనాలు, అత్తర్లు, సబ్బులు తయారుచేసే కంపెనీలు నేరుగా రైతుల నుండే కొనుగోలు చేస్తాయి. ఈ నూనెనో ఔషదా గుణాలు కూడా లేకపోలేదు, దీనిని నాడి రుగ్మతులు నయం చెయ్యడానికి, శ్వాసకోస చికిత్స, కండరాల నొప్పులు, మరియు చర్మ సమస్యలు నయం చెయ్యడానికి వినియోగిస్తారు. అంతేకాకుండా ఈ నూనెకు మనసును ఉత్తేజపరిచే గుణం కూడా ఉంది.
జాపనీస్ మింట్ కోసి రకం విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. పొలంలో ఎత్తుమడులు వేసుకొని వాటిమీద జాపనీస్ మింట్ సాగు చేస్తే మంచి నాణ్యమైన దిగుబడి లభిస్తుంది. మొక్కమధ్య మరియు వరుసల మధ్య 40cm దూరం ఉండేలా మొక్కలను నాటుకోవాలి. విత్తనం చల్లిన 120 రోజుల తరువాత మొదటి కోత వస్తుంది. కోతకోసిన తరువాత మొక్క ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలను అందిస్తే పిలకలు నుండి విస్తరిస్తుంది. విత్తనం విత్తిన తరువాత ఒక ఎకరానికి 25 కిలోల నత్రజని, 15 కిలోల భాస్పరం, 10 కిలోల పోటాష్ ఎరువులను వెయ్యడం ద్వారా, అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.
మొదటి కోత కోసిన 90 రోజులకే రెండొవ కోత కూడా చేతికి వస్తుంది. ఇలా వచ్చిన దిగుబడిని, డిస్టిల్లేషన్ యంత్రంలో వేసి, ఆకులను ఉడకబెట్టి వాటి నుండి వచ్చే ఆవిరి మింట్ ఆయిల్ ద్రావణంగా మారుతుంది. ఒక ఎకరం పంట నుండి దాదాపు 70-80 కిలోల నూనెను సేకరించవచ్చు. దీనిని కంపెనీలకు నేరుగా విక్రయించి మంచి లాభాలు పొందవచ్చు.
Share your comments