రైతులు పంటలు పండించాలంటే అనేక సవ్వళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెట్టుబడి పెరగడం మరియు ఫలసాయం తగ్గడంతో, ఎంతోమంది రైతులు అనాసక్తితోనే వ్యవసాయాన్ని నెట్టుకువస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చాలంటే వ్యవసాయంలో నూతన మార్పులు చెప్పటాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది, దీనిని అరికట్టడానికి శాస్త్రవేత్తలు కొత్త రకాలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. ప్రస్తుతం చీడపీడలను మరియు భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే రకాలు అందుబాటులోకి వచ్చాయి, రైతులు వీటిని వినియోగిస్తే అధిక లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.
మన దేశంలో సాగయ్యే నూనె గింజల్లో వేరుశెనగ ప్రధానమైనది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరుశెనగ సాగు విస్తృతంగా సాగుతుంది, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వేరుశెనగను ఎక్కువుగా సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు మరియు నేలస్వభవం వేరుశెనగ సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో వేరుశెనగ సాగుకు అనుకూలమైన రకాన్ని కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం రూపొందించింది. ఈ పరిశోధన సంస్థ కదిరి 1812 అనే పేరుతో కొత్త రాకని అభివృద్ధి చేసింది, ఈ రకం ఆ ప్రాంతం రైతుల పాలిట వరంగా మారింది.
ఈ కదిరి రకం వంగడానికి ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉండటంతో ఆ ప్రాంతంలోని ఎంతోమంది రైతులు దీనిని సాగు చేసేందుకు ఆశక్తి చూపిస్తున్నారు. ఈ రకం అధిక దుగుబడినివ్వగల సామర్ధ్యం కలిగి ఉంది, ప్రతీ మొక్కకు దాదాపు 100-150 వరకు కాయలు కాసేందుకు అవకాశం ఉంది. ఈ రకాన్ని సాగు చెయ్యడం ద్వారా రైతులు దాదాపు 45-50 క్వింటాల్లా వరకు దిగుబడి పొందే అవకాశం. కదిరి విత్తనం చీడపీడలను సమగ్రవంతంగా తట్టుకొంటుంది, కాబట్టి రైతులకు పెట్టుబడి భారం కొంతమేరకు తగ్గుతుంది.
ఈ రకాన్ని సాగు చేసే రైతులు పంట కాలం మొత్తంలో ఒక్కసారి పురుగుమందులను పిచికారీ చేస్తే సరిపోతుంది. భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలగడం, చీడపీడలను తట్టుకోవడం, మరియు దిగుబడి అధికంగా ఉండటంతో ఎంతో మంది రైతులు ఈ రకాన్ని సాగు చేసేందుకు ఆశక్తి చూపిస్తున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది రైతులు కదిరి 1812 రకాన్ని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కదిరి విత్తనం ధర క్వింటాల్కు 2,200 రూపాయలుగా ఉంది ఒక ఎకరంలో వేరుశెనగ సాగు చెయ్యడానికి రైతులకు సుమారు 15 వేల వరకు ఖర్చవుతుంది. అన్ని యజమాన్య పద్దతులు సరైన పద్దతిలో పాటిస్తే ఎకరానికి లక్ష రూపాయిలవరకు ఆదాయం వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Share your comments