Horticulture

అరటిని నాశనం చేసే పనామా తెగులు నివారణ చర్యలు!

S Vinay
S Vinay

అరటి సాగు ఎక్కువగా పనామా తెగులు గురై దిగుబడి తగ్గిపోతుంది, తద్వారా రైతన్నకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అయితే ఈ తెగుళు నివారణ చర్యలు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పనామా విల్ట్ Panama Wilt (ఫ్యూసేరియం ఆక్సిస్పోరమ్ ఎఫ్. ఎస్పీ. క్యూబెన్స్) :
ఇది మట్టి ద్వారా సంక్రమించే శిలీంధ్ర వ్యాధి వేర్ల ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తుంది. నీటి పారుదల సక్రమంగా లేని నేలల్లో ఎక్కువగా సంభవిస్తుంది.ఇది సోకినా ప్రారంభ దశలో ఆకుల పసుపు రంగులోకి మారి తరువాత వాడిపోతాయి. వ్యాధి సోకినా మొక్క కాండం ఎర్రటి చారలు కలిగి ఉంటుంది. విల్ట్ తీవ్రంగా ఉంటుంది.

ఈ వ్యాధి సోకడానికి ముఖ్య కారణాలు:
అరటిని నిరంతరాయంగా పండించడం
అధిక ఉష్ణోగ్రత, నీటి పారుదల లేని మరియు తేలికపాటి నేలలు
అధిక తేమ శాతం ఈ వ్యాధి వ్యాప్తికి దోహదం చేస్తాయి.

నియంత్రణ చర్యలు:
నియంత్రణ : ఈ వ్యాధికి తీవ్రంగా ప్రభావితమైన మొక్కలను వేరుచేసి కాల్చివేయాలి. ఒకవేళ మీ పొలంలో ఈ వ్యాధి తాకిడి తీవ్రంగా ఉంటె కనీసం 3-4 సంవత్సరాలు అరటిని తిరిగి నాటరాదు. పనామా తెగులుని తట్టుకొనే రకాలను ఎంచుకోవడం ఉత్తమం. అరటి కొత్త తర్వాత వారిని పండించడం ద్వారా కూడా వీటిని తాకిడిని అదుపులో పెట్టవచ్చు.అరటి మొక్క యొక్క పునాది దగ్గర సున్నం నీటిని చల్లడం ద్వారా వ్యాధి సోకకుండా నివారించవచ్చు. అరటి సాగు తరువాత అదే పొలంలో పొద్దుతిరుగుడు లేదా చెరకును నివారించాలి.
10 లీటర్ల నీటికి 10గ్రా.ల కార్బెండజిమ్‌ కలిపి అరటి పిలకలకి పిచికారీ చేయాలి.మట్టిలో ట్రైకోడెర్మా వైరైడ్ లేదా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ వంటి బయోఏజెంట్‌లను ఉపయోగించడం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

మరిన్ని చదవండి.

అరటిలో వేయదగిన అంతర పంటలు మరియు చేయవలిసిన అంతర కృషి!

Share your comments

Subscribe Magazine