Kheti Badi

చిరుధాన్యాల సాగు విధానం, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాల ఎంపిక...!

KJ Staff
KJ Staff

అన్ని రకాల చిరుధాన్యాలలో మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా
ఉండడం వలన వీటి సాగు ఆవశ్యకత రోజురోజుకూ పెరుగుతోంది.చిరుధాన్య పంటలైన సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, వీటిని ప్రధానంగా వర్షాధార ప్రాంతాలలో, తక్కువ పెట్టుబడితో రైతులు సాగు చేస్తున్నారు.ప్రస్తుతం చిరుధాన్యాల వినియోగం దేశంలో ఎక్కువగా ఉండడంతో వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో చిరుధాన్యాలను సాగు చేస్తున్న రైతులకు లాభాల పంట పండిస్తోంది. ఇలాంటి తరుణంలో చిరుధాన్యాల సాగు విధానం మేలైన రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొర్రలు: జూన్ రెండవ వారం నుండి జులై రెండవ వారం వరకు విత్తుకోవచ్చు ఎకరా 3 కిలోల విత్తనం అవసరమవుతుంది. స్వల్ప కాలంలో అధిక దిగుబడినిచ్చే రకాలు సూర్యనంది, ఎస్ఐఏ 3085, ఎస్ఐఏ 3156, ఎస్ఐఏ 3223
అతి స్వల్పకాలిక రకం గరుడ 60-62 రోజులలో కోతకు వచ్చిఎకరానికి 7 క్వి దిగుబడినిస్తుంది.

జొన్న:జూన్ మొదటి వారం నుండి జులై వరకు
పెట్టుకోవచ్చు ఎకరానికి 3 కిలోలు అవసరం అవసరం అవుతుంది. అందుబాటులో ఉన్న అధిక దిగుబడి ఇచ్చే రకాలు సి.ఎస్.హెచ్.-16,
ఎన్.టి.జె.-2, ఎన్.టి.జె.-3,సి.ఎస్.వి. 216ఆర్, ఎన్.టి.జె.- 4, యం. 35-1, సి.ఎస్.వి.14ఆర్

సజ్జ : తేలిక పాటి నేలల నుండి మధ్య రకం నేలలో జూన్ మాసంలో సాగుచేయవచ్చు. బరువైన నల్ల రేగడి నేలల్లో సాగు చేసినట్లయితే నీరు నిల్వ ఉండకూడదు. ఈ పంటలో ఎక్కువగా ఆశించే వెర్రికంకి తెగులు, బెట్టను తట్టుకునే రకాలు.హెచ్.హెచ్.బి.-67, ఐ.సి.ఏం. హెచ్. - 356, ఆర్.హెచ్.బి.-21, హెచ్.హెచ్. బి. 67 వంటి రకాలు అనుకూలంగా ఉంటాయి.

రాగి: జూన్ రెండవ వారం నుండి జులై రెండవ వారం వరకు విత్తుకోవచ్చు.గోదావరి, శ్రీచైతన్య, గౌతమి, వకుళ, తిరుమల, ఇంద్రావతి, వేగావతి,
వంటి అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి

Share your comments

Subscribe Magazine