Kheti Badi

గోరుచిక్కుడు లో వచ్చే ప్రధానమైన తెగుళ్లు, మరియు వాటి నివారణ చర్యలు

KJ Staff
KJ Staff

తీవ్రమైన కరువుపరిస్థితులను పరిస్థితులను తగ్గుకోగలిగే పంటలు ఏమిటంటే వెంటనే అందరు చిరుధాన్యాల పేరు చెబుతారు. అయితే కూరగాయ పంటలలో, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే పంటలు చాలా తక్కువుగా ఉంటాయి. గోరు చిక్కుడు తీవ్ర కరువు పరిస్థితులను సైతం తట్టుకోగలిగే కూరగాయపంట. వర్షాభావ పరిస్థితులతో పాటు అధిక వేడిని కూడా తట్టుకోగలిగే పంట గోరు చిక్కుడు. గోరు చిక్కుడు గింజల నుండి తయారయ్యే జిగురును బట్టలు, పేపర్, మరియు సౌందర్య సాధనాల తయారీలోనూ వాడతారు.

గోరు చుక్కుడు మొక్కలు ఎదిగాక వాటి కొమ్మలను పచ్చిమేతగా పశువులకు వాడతారు, దీని గింజలను పశువులకు దాణాగా వాడవచ్చు అలాగే దీనిని పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేసి భూసారాన్ని కూడా పెంచవచ్చు. ఇలా బహుళప్రయోజనాలు కలిగిన పంటల్లో గోరుచిక్కుడు ఒకటి. అయితే గోరుచిక్కుడు సాగు చేసే రైతులు రకాల ఎంపిక మీద ప్రత్యేక ద్రుష్టి సారించవలసిన అవసరం ఉంది. వాతావరణ పరిస్థితులు మరియు నీటి లభ్యత మీద ఆధారపడి రకాలను ఎంపిక చేసుకోవాలి. దీనితోపాటుగా పంట సమయంలో ఆశించే చీడపీడల నివారణ చర్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. గోరు చిక్కుడులో అందుబాటులో ఉన్న కొన్ని రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూసా మౌసమి:

ఖరీఫ్ పంటగా గోరు చిక్కుడు సాగు చేసే రైతులకు పూసా మౌసమి రకం ఎంతో అనువైనది. ఈ రకాన్ని, ఈ రకాన్ని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) విడుదల చేసింది. ఇది స్వల్పకాలిక రకం, నాటిన కొద్దీ రోజులకే పంట చేతికి వస్తుంది. విత్తనం విత్తిన 70-80 రోజుల్లోపు మొదటి కోతకు సిద్దమవుతుంది. కాయల ఆకర్షనియ్యమైనవిగా, 10-12 సెంటిమీటర్ల పొడవు ఉంటాయి. వీటికి మార్కెట్లో కూడా మంచి ధర లభిస్తుంది. కొమ్మలు గుబురుగా పెరిగి అధిక దిగుబడినిస్తాయి.

పూసా సదాబహార్:

పూసా సదాబహార్ రకాన్ని వేసవి పంటగా మరియు ఖరీఫ్ పంటగా సాగు చెయ్యడానికి అనువుగా ఉంటుంది. ఇది స్వల్పకాలిక రకం, విత్తనం నాటిన 40-50 రోజుల్లోనే మొదటి కోతకు సిద్దమవుతుంది. మొక్కల్లో కొమ్మలు కూడా ఎక్కువుగా ఉంటాయి వీటిని పశువులకు పచ్చి మేతగా వెయ్యచ్చు. కాయలు 12-13 సెంటిమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి.

పూసా నవబహార్:

ఈ రకాన్ని పూసా మౌసమి మరియు పూస సాదబాహర్ యొక్క కలయికతో అభివృద్ధి చేసారు. దీని కాయలు పూసా మౌసమిలా నాణ్యమైనవిగా ఉంటాయి. ఖరీఫ్ మరియు వేసవి పంటగా సాగు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.

గోరుచిక్కుడును అనేక రకాల చీడపీడలు ఆశిస్తాయి. వీటిని ముందుగానే గుర్తించి నిర్ములించడం చాలా అవసరం. గోరుచిక్కుడుని ఆశించే కొన్ని రకాల చీడపీడలు మరియు వాటి నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పేనుబంక:

పేనుబంక పురుగు లేత ఆకులను ఆశించి, వాటి నుండి రసాన్ని పీల్చి ఆకులు ముడుచుకుపోయేలా చేస్తాయి. చిన్న మరియు పెద్ద పురుగులు మొక్కలను ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. వీటిని నివారయించడానికి ఇమిడాక్లోరోఫిడ్ మరియు ప్రొపికానజోల్ మందులను 2 మి.లి ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారి చెయ్యాలి. ఈ మందులను మర్చి మార్చి పిచికారీ చెయ్యడం వలన పేనుబంక పురుగులు సమగ్రవంతంగా నివారించబడతాయి.

బూడిద తెగులు:

బూడిద తెగులు ఆశించిన మొక్కల ఆకులపై తెల్లని పొడిలాగా ఏర్పడి, తెగులు ఉదృతి ఎక్కువయ్యే కొద్దీ పసుపు రంగులోకి మారిపోతాయి, క్రమంగా ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీనిని నివారయించడానికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. తెగులు ఉదృతి ఎక్కువుగా ఉంటే, వారం రోజుల వ్యవధిలో మరోసారి మొక్కలపై ఈ మందును పిచికారీ చెయ్యాలి.

ఆకుమచ్చ తెగులు:

మొదట ఆకులపై నల్లని మచ్చలు ఏర్పడతాయి, ఇవి క్రమంగా ఆకు మొత్తం వ్యాపించి ఆకులు మాడిపోయి రాలిపోతాయి. ఈ ఆకు మచ్చ తెగులును అశ్రద్ధ చేస్తే పొలంలోని అన్ని మొక్కలకు వ్యాపించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. దీనితోపాటు కార్బెన్డిజిమ్+ మాంకోజెబ్ మిశ్రమాన్ని 2 గ్రాముల నీటిలో కలిపి మొక్కలపై చేసి ఈ వ్యాధిని నివారించవచ్చు.

ఎండు తెగులు:

గోరు చిక్కుడులో ప్రధానంగా వచ్చే తెగుళ్ళలో ఎండు తెగులు ఒకటి. దీని పేరుకు తగ్గట్టుగానే ఎండు తెగులు సోకిన మొక్కల ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు మిగిలిన మొక్కలకు వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీనిని నివారించడానికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి నేల మొత్తం తడిచేల పిచికారీ చెయ్యాలి.

Share your comments

Subscribe Magazine