భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత నాణ్యమైన కలప నిచ్చే టేకు మొక్కలను సాగు చేయడానికి చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో టేకు మొక్కల సాగు చేపట్టవచ్చు.ముఖ్యంగా ఎర్ర, ఒండ్రునేలలు అత్యంత అనువైనవిగా చెప్పవచ్చు. అయితే నీటిముంపు ప్రదేశాలు వీటి సాగుకు అసలు పనికిరావు. టేకు మొక్కలను సాధారణంగా విత్తనాలు లేదా పిలకల నుండి సహజ పునరుత్పత్తి చేయవచ్చు.లేదా టిష్యూకల్చర్ మొక్కల ద్వారా కృత్రిమ పునరుత్పత్తి చేయవచ్చు. టేకు మొక్కలను పెంచి నాటుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా టేకు విత్తనాల్లో మొలక శాతం తక్కువగా ఉంటుంది.టేకు విత్తనాలకు వివిధ రకాల సీడ్ ట్రీట్మెంట్ చేస్తే మొలక శాతం పెరిగే అవకాశం ఉంది.మొదట నాణ్యమైన టేకు విత్తనాలను సేకరించి విత్తనాలను వేడి నీటిలో 2-3 గంటల వరకు ఉంచి ఆపై విత్తనాలు చల్లబడ్డాక విత్తుకోవాలి. లేదా విత్తనాలను ఒక గోనె సంచిలో వేసి గుంతలో పూడ్చి 10 రోజుల వరకు ప్రతిరోజు నీరు పోసి ఆ తర్వాత నారుమడిలో విత్తుకోవాలి. లేదా విత్తనాలను పేడనీళ్ళ పేస్ట్లో 15 రోజులు ఉంచి ఆ తర్వాత విత్తుకోవాలి. లేదా విత్తనాలను సల్ఫ్యూరికామ్లంలో 15 ని॥లు ఉంచి తర్వాత శుభ్రంగా కడిగి విత్తుకోవచ్చు.
వివిధ పద్ధతుల్లో శుద్ధి చేసిన టేకు విత్తనాలను 6 మీ. పొడవు మరియు 1 మీ. వెడల్పు గల నారుమడుల్లో ఫిబ్రవరి-మే మధ్య కాలంలో విత్తుకోవాలి. అలా మొలిచిన మొక్కలను ఒక సంవత్సరం పాటు పెరగనీయాలి. మొక్కలను పీకి స్టంపులను తయారు చేయాలి. వేరుభాగాల్లోని ప్రక్కవేర్లను పదునైన కత్తితో తీసివేయాలి. స్టంపులను జూలై నెలలో 3 × 1.3 మీ దూరంలో వాలుకు అడ్డంగా నాటాలి లేదా స్టంపులను పాలిథీన్ సంచుల్లో 6 నెలలు పెంచి
పడుకోవచ్చు. ఒక్క ఎకరానికి దాదాపు1000
టేకు మొక్కలు నాటుకోవచ్చు.
Share your comments