Kheti Badi

క్యాప్సికం సాగులో ఫెర్టిగేషన్ విధానం, మెలకువలు..!

KJ Staff
KJ Staff

సిమ్లా మిర్చిగా పిలవబడే క్యాప్సికంను బయటి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా వెంటి లేటెడ్ పాలీహౌస్ లలో సంవత్సరం పొడవునా అధిక నాణ్యమైన క్యాప్సికమ్ పండించి విదేశాలకు ఎగుమతి చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. పాలీహౌస్ లో క్యాప్సికం మొక్కలను జూన్ నెలలో నారు పోసుకొని జూలై నెలలో నాటుకోవచ్చు. మొక్కలు నాటిన 65 రోజుల నుంచి కాయలు కోతకు వస్తాయి. పాలీహౌస్ లో మొక్కలకు నీరు, ఎరువులు,సూక్ష్మ పోషకాలను
సమృద్ధిగా అందించడానికి డ్రిప్పు పైపులు ఏర్పాటు చేసుకుని తగిన ఫెర్టిగేషన్ విధానాన్ని అమలు చేస్తే అధిక దిగుబడులను పొందవచ్చు.

ఫెర్టిగేషన్ విధానం:

ముందుగా అధిక సేంద్రియ పదార్థంతో నిండిన ఎర్ర గరప నేలల మట్టిని సేకరించి తగిన పరిమాణంలో పశువుల ఎరువు వర్మీ కంపోస్టు కలుపుకొని ఎత్తయిన బెడ్స్ ఏర్పాటు చేసుకొని వాటిపై డ్రిప్పు పైపులు అమర్చి 21 రోజుల మొక్కలను నాటుకోవాలి.

మొక్కలు నాటిన 20-25 రోజులలోపు వారానికి రెండు రోజులు నీటిలో కరిగే మోనో అమ్మోనియం ఫాస్పేటు 200 గ్రా నీటిలో కలిపి డ్రిప్ ద్వారా అందించాలి.


మొక్కలు నాటిన 25 - 50 రోజుల వరకు నీటిలో కరిగే 19:19:19 సూక్ష్మ పోషకాలన్నీ 500 గ్రా. వారానికి రెండు రోజులు డ్రిప్ ద్వారా వదలాలి.
అలాగే నీటిలో కరిగే కాల్షియం నైట్రేట్ 400 గ్రా., పొటాషియం నైట్రేటు 300 గ్రా. డ్రిప్ ద్వారా ఒకరోజు ఒక సూక్ష్మ పోషకాలన్నీ వదలాలి. మిగిలిన రోజులలో అవసరాన్ని బట్టి సాధారణ నీరు ఇవ్వాలి.

మొక్కల్లో సూక్ష్మధాతు లోపాలు కనిపించిన వెంటనే నీటిలో కరిగే వివిధ రకాల సూక్ష్మ ధాతు మిశ్రమాన్ని డ్రిప్ ద్వారా అందించాలి. రైతులు ఫెర్టిగేషన్ విధానంలో తగిన మెలకువలను పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine