మన రాష్ట్రంలో కొబ్బరి సాగు దాదాపు ఒక లక్ష ఇరవై రెండు వేల హెక్టార్లలో సాగు చేస్తూ దేశంలోనే నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఉత్పాదకతలో మాత్రం మొదటి స్థానంలో ఉంది.రాష్ట్రంలో ఉభయగోదావరి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో కొబ్బరి సాగు చేస్తున్నారు. కొబ్బరి సాగు చేపట్టిన రైతులకు దాదాపు 50 సంవత్సరాల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది
అందుకే కొబ్బరి సాగును ప్రారంభిస్తున్న రైతులు మన ప్రాంత వాతావరణానికి అనువైన అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకోవడం చాలా ముఖ్యం.
మన ప్రాంత వాతావరణానికి అనువైన అధిక దిగుబడినిచ్చే కొబ్బరి రకాలు:
గౌతమి గంగ : ఇది హైబ్రిడ్ రకం దీనిని అంబాజీపేట ఉద్యాన పరిశోధనాస్థానం వారు రూపొందించి గోదావరి గంగ అను పేరుతో మన రాష్ట్రంలో సాగునకు 1991 లో విడుదల చేయబడినది. ఈ హైబ్రిడ్ రకం నాలుగు సంవత్సరాలకు కాపు కొచ్చి 6-7సంవత్సరాలలో మంచి దిగుబడినిచ్చుట ప్రారంభిస్తుంది. సగటున ఈ హైబ్రిడ్ మొక్క నుంచి150 కాయల దిగుబడిని పొందవచ్చు.
ఈస్ట్ కోస్ట్ టాల్ : ఇది దేశవాళీ రకానికి చెందినది. ఈ రకాన్ని తూర్పు కోస్తా ప్రాంతంలో విస్తారంగా సాగు చేస్తున్నారు. నాటిన ఏడు సంవత్సరాలకు కాపుకొచ్చి సగటున ఒక్క కాపు కి 80 నుంచి 100 కాయల దిగుబడిని పొందవచ్చు.
డబుల్ సెంచరీ: ఈ రకం తూర్పు తీర ప్రాంతానికి అనువైనదిగా ఉండి అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. దేశవాళి రకానికి అంటే అధిక దిగుబడి ఇచ్చే పొడుగు రకం. డబుల్ సెంచరీ రకం నాటిన ఏడు సంవత్సరాలకు కాపుకొచ్చి సగటున ఒక్కసారి 140 కాయలను ఇస్తుంది.
ఈ కాయల్లో అత్యధికంగా 64% నూనె కలిగి ఉంటుంది.
గౌతమి గంగ : అత్యధిక నీరు ఉండే కొబ్బరి బొండాలకు ప్రసిద్ధి గాంచిన రకం. కోనసీమ ప్రాంతంలో అత్యధికంగా సాగు చేస్తున్నారు.నాటిన మూడు నుండి నాలుగు సంవత్సరాలకే కాపుకు వచ్చి ఒక్కసారి సగటున 90 కాయల అధిక దిగుబడి నిస్తుంది. ఈ చెట్లు పొట్టిగా ఉండి కాయలను కోయడానికి సులువుగా ఉంటాయి.
Share your comments