భారతదేశంలో పెరిగే అత్యంత అరుదైన మొక్కల జాబితాలో శ్రీ గంధం మొక్క కూడా ఒకటి. పురాతన ఆయుర్వేద వైద్యంలో శ్రీ గంధం మొక్క తైలానికి ప్రముఖ స్థానం ఇవ్వబడింది.శ్రీ గంధపు మొక్కలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ భారతదేశంలో పెరిగి శ్రీ గంధపు మొక్కలు అధిక నాణ్యత కలిగి ఉండడంతో ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ కలదు.ప్రస్తుతం శ్రీ గంధం మొక్కలు అంతరించిపోతున్న మొక్కలు జాబితాలు ఉండడం వల్ల చాలా రాష్ట్రాలు శ్రీగంధం సాగు చేయడానికి రైతులను ప్రోత్సహిస్తున్నారు.
శ్రీ గంధం మొక్కల్లో ఒక ప్రత్యేక లక్షణం కలదు.
ఈ మొక్కలు చెట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను భూమి నుంచి పొందడానికి వేరే మొక్కల వేర్లపై ఆధారపడతాయి. అందుకే ఈ వృక్షాలను పరాన్నజీవ వృక్షాలు అని అంటారు.
శ్రీ గంధం మొక్కలు దాదాపు 300 ఇతర రకాల మొక్కల వేర్లతో ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకొని నీటిని, పోషకాలను గ్రహిస్తుంది.ఈ మొక్కలను అతిధి మొక్కలు
(హోస్ట్ ప్లాంట్) అని అంటారు.
శ్రీగంధం సాగులో హోస్ట్ ప్లాంట్ కు చాలా ప్రాముఖ్యత ఉంది.ఇప్పుడిప్పుడే శ్రీగంధం సాగు పై ఆసక్తి చూపుతున్న రైతులు హోస్ట్ ప్లాంట్స్ గా ఉసిరి, నిమ్మ, జామ, నేరేడు, టేకు, మామిడి మొక్కలను నాటుకున్నట్లయితే 4 సంవత్సరాల తర్వాత వీటి నుంచి కూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చు.శ్రీగంధం సాగులో హోస్ట్ ప్లాంట్స్ గా ఉసిరి మొక్కలను పెంచుకుంటే మంచిది. ఎందుకంటే ఉసిరి ఆకులు చిన్నవిగా ఉండి ప్రధాన పంటకు నష్టం కలిగించవు. పైగా ఉసిరికాయలు దేశీ మార్కెట్లో మంచి డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది కావున శ్రీగంధం సాగులో అదనపు ఆదాయం పొందవచ్చు.
Share your comments