Kheti Badi

తేనెటీగల పెంపకం ప్రాముఖ్యత, పెంపకానికి అనువైన తేనెటీగ జాతులు...!

KJ Staff
KJ Staff

వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటైనా తేనెటీగల పెంపకానికి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. తేనెటీగల పెంపకాన్ని "ఎపికల్చర్‌" అంటారు .పూల సాగు,పండ్ల తోటల సాగు, కూరగాయల సాగు చేస్తున్న రైతులు కొద్దిపాటి శ్రమ కలిగిన తేనెటీగల పరిశ్రమను రైతులు అదనపు ఆదాయం కోసం ప్రారంభించి అధిక లాభాలను పొందవచ్చు. పోషక విలువలు సమృద్ధిగా ఉన్న స్వచ్ఛమైన తేనెకు ప్రపంచ మార్కెట్లో సైతం మంచి డిమాండ్ కలిగి ఉంది. రైతులు, నిరుద్యోగ యువత కొద్దిపాటి శ్రమ నైపుణ్యంతో ఆధునిక పనిముట్లను ఉపయోగించి తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించవచ్చు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగు రకాల తేనేటీగల జాతులను పెంపకానికి అనువైనవి గా గుర్తించారు అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఎపిస్ డార్సటా (రాక్ బీ) :ఈ జాతి తేనెటీగలు అత్యధిక తేనెను సేకరిస్తాయి.సగటున ఒక్కొక్క తేనె పట్టుకు 50 నుంచి 80 కిలోల తేనెను సేకరిస్తాయి.వీటిని కొండతేనెటీగలు అని కూడా పిలుస్తారు.

ఎఫెస్ మెలిఫెరా : (ఇటాలియన్‌ బీ) ఈ జాతి తేనెటీగలు ఒక్కొక్క తేనె పట్టుకు 25 నుండి 40 కిలోల తేనెను సేకరిస్తాయి.వీటిని యూరోపియన్ బీ అని కూడా అంటారు.

ఎఫిస్ సెరినా ఇండికా (ఇండియన్ బీ) : ఈ జాతి ఈగలు ఏడాదికి సగటున 6 నుండి 8 కిలోల తేనెను సేకరిస్తాయి.వీటిని పుట్ట తేనెటీగలు అని కూడా పిలుస్తారు.

ఎపిస్ ప్లోరియా (లిటిల్ బీ) :ఈ జాతి తేనెటీగలుసేకరిస్తాయి.ఒక్కొక్క తేనె పట్టుకు కేవలం 200 గ్రాముల నుంచి 900 గ్రాముల తేనె మాత్రమే సేకరిస్తాయి.

Related Topics

Honey bee brids cultivation

Share your comments

Subscribe Magazine