Kheti Badi

మల్లె పూల సాగులో పురుగుల ఉధృతి.. నివారణ చర్యలు.!

KJ Staff
KJ Staff

ప్రస్తుతం మల్లెపూలకు మార్కెట్లో స్థిరమైన ధర లభిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు మల్లె సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించి అద్భుతమైన ఫలితాలను పొందుతారు
మల్లె బహువార్షిక పంట కావడంతో అనువైన నేలలు ఎన్నుకొని సాగు చేసుకోవడం మంచిది.
సాధారణంగా మల్లె నాటిన 2వ సంవత్సరంలోనే పూతకు వస్తుంది. మల్లె మొగ్గ దశలో వివిధ రకాల పురుగులు ఆశించి పూల దిగుబడి నాణ్యతను పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నాణ్యమైన మల్లెపూల దిగుబడి పొందడానికి కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

ఎండు తెగులు : ఈ తెగులు సోకిన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి కోమ్మలు ఏంటి పోయి చివరికి మొక్క చనిపోతుంది.ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు , లీటరు నీటికి కలిపి మొక్క మొదలులో పోయాలి.

మొగ్గ తొలుచు పురుగు: మల్లె మొగ్గ దశలో ఈ పురుగులు తీవ్రంగా నష్టపరుస్తాయి.తల్లి పురుగు మొగ్గలపై మొగ్గ కాడలపై గ్రుడ్లను పెట్టడం వల్ల ఈ పురుగు లార్వాలు మొగ్గలోకి చొచ్చుకొనిపోయి పూల భాగాలను తినడం వల్ల మొగ్గలు ఎండిపోయి రాలిపోతాయి. ఈ పురుగు నివారణకు మలాథియాన్ లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

స్టింక్ బగ్ : ఈ పురుగులు మొక్కలేత భాగాల నుంచి, పూల నుంచి రసాన్ని పీల్చటం వలన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారుతాయి ఈ పురుగు ఆశించడం వల్ల పూల నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. ఈ పురుగు నివారణకుమలాథియాన్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా మిన్ 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

నల్లి : పొడి వాతావరణంలో నల్లి ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది.ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల మీద, లేత కొమ్మల మీద, మొగ్గలపై తెల్లటి వెంట్రుకలతో కూడిన మచ్చలు కనిపిస్తాయి. వీటి నివారణకు గంధకపు పొడిని ఎకరానికి 8-10 కిలోల చొప్పున చల్లుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine