Kheti Badi

వరి కొయ్యలను తగలబెడితే జరిగే నష్టం గురించి మీకు తెలుసా?

KJ Staff
KJ Staff

ఖరీఫ్ లేదా రబిలో వరి పంటను సాగు చేసిన తరువాత, వరి కొయ్యలను తగలబెడుతూ ఉంటారు. ఈ పద్దతి కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరి సాగు చేసే అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పద్దతిని ఉపయోగించడం గమనించవచ్చు. అయితే చెయ్యడం వలన పర్యావరణానికి మరియు మట్టికి తీరని నష్టం వాటిల్లుతుంది. వరి సాగు చేసే హర్యానా మరియు పంజాబ్ ప్రాంతాల్లో ఎక్కువశాతం రైతులు ఈ పద్దతిని పాటించడం ద్వారా ఢిల్లీలో వాయుకాలుష్యం పెరగడానికి ఒక ప్రధాన కారణంగా మారుతుంది.

మట్టికి హానికరం

మునుపటి రోజుల్లో వరి గడ్డిని కొడవళ్లు సహాయంతో కోతలు కోసేవారు, గడ్డి అడుగుభాగం వరకు కోసి పశువులకు మేతగా వాడేవారు. అయితే ఇప్పుడు వరి కోత కోసే యంత్రాలు అందుబాటులోకి రావడం మరియు పాడి పశువుల సంఖ్య తగ్గిపోవడం వలన గడ్డి వినియోగం కూడా చాలా వరుకు తగ్గిపోయింది. వరి కోత కోసే యంత్రాలు సగం ఎత్తువరకు మాత్రమే గడ్డిని కొస్తాయి. పొలంలో మిగిలిన గడ్డి దున్నే సమయంలో అడ్డుగా ఉంటుందని తగలబెట్టడం జరుగుతుంది. ఇలా చెయ్యడం ద్వారా పర్యావరణ కాలుష్యంతో పాటు, మట్టికి కూడా నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు.

తరువాతి పంటకు ప్రమాదం

పొలంలో మిగిలిన వరి గడ్డిని మరియు కొయ్యలను తగలబెట్టడం ద్వారా, ముందుగా మట్టిలోని తేమ మొత్తం ఆవిరైపోతుంది. అంతేకాకుండా పంటకు మేలు చేసే ఎన్నో జీవరాసులు కూడా నశిస్తాయి. కొయ్యలను కాల్చడం వలన మట్టి గట్టిపడుతుంది దీనివలన మట్టిని దున్నడం కష్టమవుతుంది. పంట ఆవేశాలను కాల్చినప్పుడు ఉత్పన్నమయ్యే పొగ మరియు బూడిద వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. పైగా ఈ పద్దతిని ఎక్కువకాలం అనుసరిస్తే భూమిలోని కొన్ని పోషకాలు నశించే అవకాశం కూడా లేకపోలేదు, దీనివలన తరువాతి కాలంలో వేసిన పంట దిగుబడి కూడా తగ్గిపోతుంది.

వరి కొయ్యల వల్ల కలిగే ప్రయోజనం

వరి కొయ్యల ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముందుగా వీటి వేర్లు భూమిని పట్టి ఉంచి నీటిని, మరియు ఇతర పోషకాలను పోనివ్వకుండా చేస్తాయి. వేర్లు మట్టిని పట్టి ఉంచడం చేత మట్టి వృథా తగ్గుతుంది. వీటిని భూమిలో కలియదున్నడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పంట కోత కోసిన తరువాత, ఈ కొయ్యలను మరియు వరి గడ్డిని భూమిలో దున్నకోవాలి, ఇలా చెయ్యడం ద్వారా మొక్కల అవశేషాలు భూమిలో కలిసి మట్టికి అదనపు పోషకాలు అందేలా చేస్తాయి.

 

కొయ్యలు కలియదున్నిన వెంటనే పొటాషియం ఎరువులను కలపాలి ఇలా చెయ్యడం ద్వారా సేంద్రియ ఎరువుగా మారుతుంది. వ్యవసాయ నిపుణులు కూడా వరి కొయ్యలను కాల్చకుండా దున్నుకోవడం మంచిదని రైతులకు సూచిస్తున్నారు. కలియదున్నితే భూసారం పెరుగుతుంది, భూమిలోని సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది, పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు.

Share your comments

Subscribe Magazine