Kheti Badi

ధాన్యానికి మద్దతు ధర లభించాలంటే... ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

KJ Staff
KJ Staff

రైతులు ఎంతో కష్టపడి పంటలను పండిస్తారు. ఈ విధంగా పండించిన పంటలకు సరైన మద్దతు ధర లభించక అధిక నష్టాలను ఎదుర్కొంటారు.ఈ క్రమంలోనే తీవ్రంగా అప్పులు పాలవడంతో ఎంతో మంది రైతులు వ్యవసాయానికి స్వస్తి పలికి ఉపాధి హామీ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు.అయితే మనము పండించిన పంటకు మద్దతు ధర లభించాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి ఆ జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...

మనం పంటను కోత కోసే ముందు దాని పరిపక్వత రోజులు, పంట నిలుపుదలని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వరి కోత కోసే ముందు గడ్డి పూర్తిగా పొడి కాకముందే అది నిమ్మపండు రంగులోకి మారి కంకులు కిందికి ఒంగినప్పుడు మాత్రమే పంటను కోయాలి. అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పుల వల్ల కొంతమంది పంట కోయక ముందే అధిక వర్షపాతం నమోదయ్యే పొలంలో అధిక తేమ ఉంటుంది. ఈ క్రమంలోనే రైతులు తమ పంటను జడ కట్లు కట్టడం ద్వారా తొందరగా తేమ ఆరిపోయి పంటను కోసుకోవచ్చు.

పంట కోయడానికి ముందుగా వర్షం పడితే 50 గ్రాముల ఉప్పు నీటిని 50 లీటర్ల నీటిలో కలిపి పొలం మొత్తం పిచికారి చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల గింజ నాణ్యత కోల్పోదు. ఒకవేళ దాన్యం కలములో నానిపోతే ఆ దాన్యం మొలకలు రాకుండా రంగు మారకుండా ఉండటం కోసం ధాన్యపు కుప్ప పై రాళ్ళ ఉప్పు చల్లుకోవాలి. అదేవిధంగా ధాన్యాన్ని మార్కెట్ కి తరలించే సమయంలో ఎలాంటి పెల్లలు ,రాళ్ళు లేకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులకు సరైన గిట్టుబాటు ధర కలగాలంటే గింజలలో 10 నుంచి 12 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని ధాన్యాన్ని మార్కెట్ కి తరలించినప్పుడే రైతులు సరైన గిట్టుబాటు ధరను పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine