Kheti Badi

అధిక దిగుబడనిచ్చే కొర్ర రకాల సాగు యాజమాన్యం...

KJ Staff
KJ Staff

ప్రధాని నరేంద్ర మోడీ చిరుధాన్యాల పంటలు సాగు చెయ్యాలని ఇచ్చిన పిలుపుతో దేశంలోని ఎంతో మంది రైతులు వీటిని సాగు చెయ్యడం ప్రారంభించారు. చిరుధాన్యాల్లో కొర్రలకు ప్రత్యేక స్థానం ఉంది, ముఖ్యంగా షుగర్ ఉన్నవారు వీటిని తినడం వలన రక్తంలో షుగర్ నియంత్రించబడుతుందని నమ్ముతారు. అంతేకాకుండా వీటిని తినడం ద్వారా అధిక మొత్తంలో ఫైబర్ లభిస్తుంది, దీని వలన మలబద్దకం గ్యాస్ అసిడిటీ వంటి వ్యాధుల నుండి కూడా రక్షణ లభిస్తుంది.

ఈ ఏడాది కేంద్రం పంట ఉత్పత్తులకు ఇచ్చే కనీస మద్దతు ధరను ప్రకటించింది, దీనిలో చిరుధాన్యాల పంటలకు అధిక మద్ధతు ధరను ప్రకటించడం గమనార్హం. చిరుధాన్యాలను సాగు చెయ్యడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. చిరుధాన్యాల సాగుకు సాగు నీటి అవసరం చాలా తక్కువ, కాబట్టి వర్షాధారంగా పంటలు సాగు చేసే ప్రాంతల్లో కూడా సులభంగా సాగు చెయ్యవచు. చిరుధాన్యాల సాగుకు అయ్యే ఖర్చు మరియు పంట కాలపరిమితి కూడా చాలా తక్కువ, కనుక రైతులు తక్కువ ఖర్చుతో కొద్దీ కాలంలోనే పంటను పొందవచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో, మార్కెట్లో వీటికి గిరాకీ పెరిగుతుంది, అందుకుగాను రైతులు కూడా వీటిని సాగు చేసేందుకు ఆశక్తి చూపుతున్నారు.

చిరుధాన్యాల్లో కొర్రలకు ప్రత్యేక స్థానం ఉంది, దీని పంట కాల పరిమితి కూడా చాలా తక్కువ. కేవలం మూడు నాలుగు వర్షాలతోనే పంట కాలం పూర్తవుతుంది. అంతేకాకుండా వరి మరియు గోధుమల కంటే పోషకాలు ఎక్కువుగా ఉండే పంట. 100 గ్రాముల కొర్రల్లో 12.3 గ్రాముల మాంసకృతులు, 8 గ్రాముల పీచుపదార్థం , 3.3 గ్రాముల ఖనిజ లవణాలు, 31 శాతం కాల్షియం, 2.8 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉన్నవారు కొర్రలు తినడం ద్వారా అధిక కొవ్వును తొలగించుకోవచ్చు. కొర్రలు స్థూలకాయం, బీపీ, షుగర్, మరియు గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి.

కొర్రల సాగకు తేలికపాటి ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు అనుకూలం. సాగు నీరు లబ్యతలేని ప్రాంతాల్లో కూడా వర్షాధారంగా సులభంగా సాగు చేసుకునే పంట కొర్రలు సాగు చేసే రైతులు సాగుకు అనుకూలమైన రకాలను ఎంచుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో కొర్రలను ఖరీఫ్ మరియు రబీ పంటగా సాగు చేస్తారు. ఖరీఫ్ పంటగా సాగు చేసేవారు, ఖరీఫ్ రెండో వారం నుండి జులై మొదటివారం లోపు విత్తుకోవడం ప్రారంభించాలి. అదే వేసవి పంటగా సాగుచేస్తే జనవరి మొదటి వారానికల్లా పంట నాటుకోవడం పూర్తిచెయ్యాలి. కొర్రలో అధిక దిగుబడినిచ్చే రకాలను వ్యవసాయ పరిశోధన సంస్థ రూపొందించి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చాయి. వాటిలో సూర్య నంది, ఎస్‌.ఐ.ఏ-3156 (ముప్పైఒకటి యాబైఆరు), ఎస్‌.ఐ.ఏ-3085 (ముప్పై ఎనబై ఐదు). సూర్య నంది రకం. ఇది ఖరీఫ్, వేసవికి అనువైన రకం. పంట కాలం 75 నుండి 80 రోజులు. అగ్గితెగులు, వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది.ఈ రకాలను సాగు చెయ్యడం ద్వారా ఎకరానికి 10-12 క్వింటాల్ దిగుబడి లభిస్తుంది.

కొర్రలు సాగు చేసే రైతులు చీడపీడల మీద ప్రత్యేక ద్రుష్టి సారించవలసిన అవసరం ఉంటుంది, కొర్రల పంట కాలం తక్కువే అయినప్పటికీ కొన్ని వాతావరణ పరిస్థితుల్లో చీడపీడల బాధ కూడా ఎక్కువుగా ఉంటుంది. పంటను ఆశించే పురుగుల్లో గులాబీ రంగు పురుగు ఒకటి, ఈ పురుగు యొక్క లార్వాలు మొవ్వను తొలచి తినడం వలన మొవ్వ చనిపోవడం జరుగుతుంది. ఈ పురుగును గుర్తించగానే 2.5 మి.లి క్లోరిఫైరిఫాస్ మందును ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగులతోపాటు సిలింద్రలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. తేమ ఎక్కువుగా ఉండే ప్రాంతాల్లో ఆకు కింద భాగాన్న బూజు వంటి శిలింద్రం ఏర్పడుతుంది, ఇటువంటి మొక్కల్లో మొక నుండి బయటకి వచ్చిన కంకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారతాయి. దీనిని నివారించడానికి 2 గ్రాముల మెటాలాక్సిల్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి.

Share your comments

Subscribe Magazine