భారతీయ వంటకాల్లో అల్లానికి ఉన్న ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాశ్మీర్ నుండి కన్య కుమారి వరకు అల్లానికి ఎంతో ఆధారణ ఉంది. అల్లం కేవలం వంటకాలకే పరిమితం కాదు, దీనిలో ఎన్నో ఔషధ గుణాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇంత విశిష్టత ఉన్న అల్లాని మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు మరియు కర్ణాటక ప్రాంతాల్లో కూడా విరివిగా సాగుచేస్తారు. అయితే అల్లం సాగుచేసే రైతులు ప్రధానంగా ఎదుర్కునే సమస్య వేరుకుళ్లు తెగులు. దాదాపు అన్ని దుంప జాతి మొక్కల్లో ఈ వేరు కుళ్ళు తెగులు ప్రధానంగా కనిపిస్తుంది, ఈ వ్యాధి సోకినా పంట దిగుబడిని ఇవ్వలేదు. అయితే ఈ సమస్యను మందుల వాడకంతోపాటు కొన్ని యాజమాన్య పద్ధతుల ద్వారా కూడా నివారించవచ్చు.
అల్లంలో వచ్చే వేరుకుళ్లు తెగులును నియంత్రించడానికి, ఎత్తుమడుల పై అల్లాన్ని సాగుచెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా రైతులు బోదెలపై అల్లాన్ని సాగుచేస్తూ వస్తున్నారు, అయితే ఈ పద్దతిలో సాగుచేసినప్పుడు, అనేక సమస్యలు తలేతెందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో, నీరు నిలిచి, బోదె మరియు కాలువ ఏకమై నీరు నిలవడం ప్రారంభమవుతుంది, దీని వలన ఎన్నో వ్యాధులు ప్రభలమవుతాయి వాటిలో వేరు కుళ్ళు తెగులు ప్రధానమైనది. అంతేకాకుండా నీటి ముంపు వలన దిగుబడి కూడా తగ్గిపోయి పెట్టుబడి కూడా రాని పరిస్థితి వస్తుంది.
దీనివలన సాధారణ బోదెలపై కంటే వెడల్పయిన ఎత్తుమడుల మీద పంటలు సాగుచెయ్యడం ద్వారా ఎన్నో ప్రయోజాలను ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ పద్దతిలో సాగు చేయడం ద్వారా వర్షపు నీరు నిలబడదు, కాబట్టి వేరుకుళ్లు తెగులును కూడా సమగ్రవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా దిగుబడి కూడా 30-40% పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎత్తుమడుల పద్దతిలో అల్లం సాగుచేసే రైతులు బెడ్ల మీద అల్లాన్ని రెండు వరుసలలో విత్తుకోవాల్సి ఉంటుంది. బెడ్లను ఒక రెండగుల వెడల్పుతో 60-70 సెంటీమీటర్ల ఎత్తులో బెడ్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మురుగునీరు పోవడానికి కాలువను కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. బెడ్లను ఏర్పాటు చేసుకునే ముందు ఎకరానికి 5 టన్నుల పశువుల ఎరువును వేసి దున్నుకుంటే మొక్క ఎదగడానికి అవసరమైన పోశాలకు అన్ని సమావృద్ధిగా లభిస్తాయి.
Share your comments