Kheti Badi

ఇంటివద్దే ఆర్గానిక్ ఎరువును తయారుచేసుకోవడం ఎలా?

KJ Staff
KJ Staff

రసాయన ఎరువుల ద్వారా భూమికి జరుగుతున్న హానిగురించి మనందరికి తెలుసు. రైతులు రసాయన ఎరువులను ఎక్కువుగా వినియోగించడం మనిషి ఆరోగ్యానికి కూడా ఎంతో హానివాటిల్లుతుంది. అయితే చాల మంది ఈ దుష్ప్రభావాలను గుర్తించి, ఇంటివద్దే తమకు కావాల్సిన కూరగాయలను పండిస్తుంటారు. ఇంటి పెరటిలో ఒక చిన్న తోటను ఏర్పాటు చేసుకున్నట్లైతే మనసుకు ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఇంటి వద్దే కూరగాయలు పెంచే వారు, మొక్కలకు పోషకాలు అందించే ఆర్గానిక్ ఎరువును సులభంగా ఇంటివద్దే తయారుచేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్గానిక్ ఎరువు లేదా కంపోస్ట్, మట్టిలోని సారని పెంచి మొక్కకు అవసరమైన పోషకాలను అందిస్తుంది, కంపోస్ట్ ఉపయోగించడం ద్వారా మొక్కలకు కావాల్సిన నీటిని కూడా పట్టి ఉంచి అవసరమైనప్పుడు అందిస్తుంది. అయితే కంపోస్ట్ వివిధ రకాల్లో మార్కెట్లో అందుబాటులో ఉంది, కాకపోతే కొన్ని సులువైన పద్దతుల ద్వారా, మీ వంటింటి నుంచి వచ్చే వ్యర్ధాల నుండి కూడా కంపోస్ట్ తయారుచేసుకోవచ్చు. కంపోస్ట్ వినియోగం ద్వారా భూమిలోని కర్బన శాతాన్ని కూడా పెంచుకోవచ్చు. దీని వలన భూమిలోని ఉపయోగకరమైన బాక్టీరియా వృద్ధి చెంది మట్టికి మరింత మేలును చేకూరుస్తుంది.

అయితే ఇంటివద్దే కంపోస్ట్ తయారుచేసుకోవడం కూడా చాల సులభం, దీనికి కావాల్సిందల్ల కంపోస్ట్ బిన్, వంటగదిలోని వ్యర్ధాలు, మరియు ఎందున ఆకులు మరియు కొమ్మలు. మొదటిగా మీ యొక్క పెరటి ఆవరణను బట్టి కంపోస్ట్ బిన్ ఎంచుకోవాల్సి ఉంటుంది, మార్కెట్లో ఎన్నో రకాల కంపోస్ట్ బిన్లు అందుబాటులో ఉన్నాయి, ఈ బిన్ ఎంచుకునేటప్పుడు నీరు బయటకు పోవడానికి వీలుండి, గాలి బాగా ప్రసరించే కంపోస్ట్ బుట్టలను మాత్రమే ఎంచుకోవాలి.

ఎంచుకున్న కంపోస్ట్ బుట్టలో వంటగది నుండి వచ్చే కూరగాయల తుక్కు మరియు ఇతర వ్యర్ధాలను ప్రతిరోజు ఈ బుట్టలో వెయ్యాలి, ప్లాస్టిక్ మరియు పాలిథిన్ కవర్లు ఈ వ్యర్ధాలతో కలపకూడదు. కూరగాయలు మరియు ఇతర మొక్కల ఆధారిత వ్యర్ధాలలో నైట్రోజన్ శాతం ఎక్కువుగా ఉంటుంది. వీటితో పాటు ఎండిన ఆకులను మరియు కొమ్మలను కూడా కంపోస్ట్ బిన్లో ఒక పొరగా వెయ్యాలి దీని వలన కంపోస్ట్ త్వరగా త్యరవడంతోపాటు, కంపోస్టులోని సమతుల్యత కాపాడబడుతుంది.

కంపోస్ట్ తయారుకావడానికి కంపోస్ట్ బుట్టలో గాలి బాగా ప్రసరించడంతో పాటు నీరు కూడా అవసరం. బుట్టలో ఉంచిన వ్యర్ధాలు ఎండిపోకుండా నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. ప్రతి రెండు వారాలకు ఒకసారి వ్యర్ధాలను పర సహాయంతో తిరగేస్తూ ఉండాలి. దీని వలన గాలి ప్రసరణ బాగా జరిగి కంపోస్ట్ తయారవుతుంది. పైన సూచించిన పద్దతులన్నీ జాగ్రత్తగా పాటించినట్లైతే రెండు నెలల్లోనే, మొక్కల పెంపకాన్ని ఎంతో అనువైన కంపోస్ట్ సిద్దమవుతుంది.

Share your comments

Subscribe Magazine