Kheti Badi

ఖరీఫ్ సీజన్లో పత్తిని ఆశించే ప్రధానమైన చీడపీడలు మరియు వాటి కారణాలు....

KJ Staff
KJ Staff

వాణిజ్య పంటగా పరిగణించే పత్తిని, మన తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సాగుచేస్తారు. ముఖ్యంగా తెలంగాణలోని నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం, మరియు వరంగల్ ప్రాంతాల్లో పత్తిపంటను విస్తృతంగా సాగుచేస్తారు. ప్రతిఏటా ఎన్నో లక్షల ఎకరాల్లో దీనిని సాగుచేస్తున్నారంటే దీనికున్న విశిష్టత గురించి వేరే చెప్పనవసరం లేదు. అయితే పత్తి పాటను ఎన్నో తెగుళ్లు ఆశిస్తాయి, దీని వలన పంట దిగుబడిలో తగ్గుదల కనబడుతుంది. పత్తిలో ఈ తెగుళ్లు మరియు పురుగులు రావడానికి అనేక వాతావరణ పరిస్థితులు కారణం కావచ్చు, అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శనగపచ్చ పురుగు(హెలికోవేర్ప)

హెలికోవేర్ప పురుగు పత్తి పంటలో ప్రధానంగా ఆకులను మరియు ఇతర భాగాలను తింటూ పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. కొన్ని సార్లు ఖరీఫ్ సీసన్ లో తక్కువ వర్షాలు కురిసి, నవంబర్ నెలలో వర్షాల పడతాయి, ఇటువంటి వాతావరణంలో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోతుంది, ఈ పరిస్థితుల కారణంగా హెలికోవేర్ప పురుగుల ఉదృతి ఎక్కువవుతుంది. అయితే పురుగు పెరిగిన తరువాత కాకుండా లార్వా లేదా గూడు దశలో ఉన్నపుడు వర్షాలు పడితే పురుగుల ఉదృతి తగ్గుతుంది.

తెల్లదోమ:

తెల్లదోమ కేవలం పత్తిపంటలోనే కాకుండా మిగిలిన పంటల్లో కూడా తీవ్ర నష్టాన్ని కలిగించగలడు, ఈ పురుగులు మొక్కలనుండి రసాన్ని పీల్చడమే కాకుండా వైరస్ వ్యాధిని కూడా వ్యాప్తి చెందేలా చేస్తుంది. పంటలో పదిరోజులకు మించి బెట్ట వాతావరణం ఏర్పడి, వాతావరణం పొడిగా ఉన్నట్లైతే, తెల్లదోమలు వేగంగా వ్యాప్తి చెందుతాయి.

గులాబీ రంగు పురుగు:

ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా ఉంటూ, మబ్బులతో కూడిన వాతావరణం మరియు వర్షపాతం సానుకూలంగా ఉన్నట్లైతే ఈ గులాబీ రంగు పురుగులు ఉదృతి పెడుతుంది, వ్యాప్తి కూడా తొందరగా జరుగుతుంది.

వేరుకుళ్లు తెగులు:

ఈ వ్యాధి సోకినా మొక్కలు ఉన్నటుంది, పసుపు రంగులోకి మారి ఎండిపోయి రాలిపోవడం, మొక్కలు వాడిపోవడం ఒడలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వేరుకుళ్లు తెగులు రావడానికి పొలంలో బెట్ట పరిస్థితులు ఏర్పడి ఒకేసారి వర్షాలు కురవడం ప్రధాన కారణం.

కాయకుళ్ళు మరియు కాయరాలుట:

పత్తి కాయదశలో ఉన్నపుడు వర్షాలు ఎక్కువుగా పడితే మొక్కలను కాయకుళ్ళు ఆశించే ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా కాయలు ఎండిపోయి రాలిపోయే ప్రమాదం ఉంటుంది.

వర్టిసిలియం వడలు తెగులు:

పత్తిపంటను ప్రధానంగా ఆశించే తెగుళ్లలో ఈ వర్టిసిలియం వడలు తెగులు ఒకటి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి 15-20 డిగ్రీల మధ్య ఉన్నపుడు ఈ తెగులు వ్యాప్తిచెందడానికి అవకాశం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine