Kheti Badi

వరి నారుమళ్లు పెంచే సమయంలో పాటించవలసిన జాగ్రత్తలు

KJ Staff
KJ Staff

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో, వరిని ప్రధాన ఆహార పంటగా అధిక మొత్తంలో సాగుచేస్తారు. నీటి లభ్యత బాగా ఉన్న ప్రాంతాల్లో, వరిని ఖరీఫ్ మరియు రబీ రెండు సీసాన్లలో సాగుచేస్తారు. ప్రస్తుతం రబీ పంట కాలం పుర్తయింది. రైతులు ఖరీఫ్ వరి పంట సాగు కోసం సన్నాహాలు చేస్తున్నారు. మే చివరి వరం నుండి, పొలాల్ని దుక్కి, వరి నారుమళ్లు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే నారుమళ్లను పెంచే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వరి సాగు నుండి మంచి దిగుబడి పొందేందుకు ఆస్కారం ఉంటుంది.

విత్తన ఎంపిక:

వరి సాగు నుండి అధిగ దిగుబడులు పొందడానికి, విత్తన ఎంపిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. మంచి విత్తన రకాన్ని ఎన్నుకోవడంలోనే, అధిక దిగుబడి రావడం ముడిపడిఉంటుంది. నీటి లభ్యత మరియు వాతావరం పరిస్థితులకు అనుగుణంగా ఉండే వరి రకాలను ఎన్నుకోవాలి. సాధారణంగా ఒక ఎకరానికి 20-25 కిలోల విత్తనం సరిపోతుంది . స్వల్పకాలిక రకాలను ఎంచుకోవడం ద్వారా ఒక ఏడాదికి మూడు పంటల వరకు పొందే అవకాశం ఉంటుంది.

నారుమళ్లు యాజమాన్యం:

రబీ పంట పూర్తయిన, ఒక నెల రోజుల్లో ఖరీఫ్ పంట ప్రారంభించడం జరుగుతుంది. మే చివరి దశకంలో తొలకరి చినుకులు పడటంతో రైతులు మట్టిని దున్నడం మొదలుపెడతారు. నారుమడి వెయ్యడానికి మట్టిని రెండు మూడు సార్లు మెత్తగా దున్నవలసి ఉంటుంది. నారుమడిని రెండు రకాలుగా వేస్తుంటారు. నీటి లభ్యత అధికంగా ఉన్న చోట దంప నారుమడి వేస్తారు, మరియు కొన్ని ప్రాంతాల్లో మెట్ట నారుమడిని కూడా వేస్తుంటారు. సాధారణంగా ఒక ఎకరం వరిచేనుకు ఐదు సెంట్ల భూమిలో నారుమళ్లు వేస్తుంటారు. చదును చేసే ప్రాంతంలో నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలి.

నారుమడి వేసే ముందు విత్తన శుద్ధి చెయ్యడం ఉత్తమం. విత్తనశుద్ధి చేసేందుకు మూడు గ్రాముల కార్బెన్డిజిమ్ ఒక లీటర్ నీటికి కలిపి ఆ నీటిలో విత్తనాలను ఒక 24 గంటలు నానబెట్టాలి, ఈ విధంగా చెయ్యడం ద్వారా విత్తనంలో శిలింద్రాలు నశించి పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది. నానబెట్టిన విత్తనం మొలకెత్తేందుకు వీలుగా గోనె సంచుల్లో ఉంచాలి. విత్తనాలు మొలకెత్తిన తర్వాత నాటేందుకు అనుకూలంగా ఉంటాయి. ఒక ఎకరా వరి సాగుకోసం ఐదు సెంట్ల భూమిలో నరుమాళ్లును నాటుకోవాలి. పంట ఆఖరి దుక్కులో ఒక ఎకరానికి 1.5 కేజీల యూరియా , 6 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో మ్యురైటే ఆఫ్ పోటాష్ నారుమడి పెంపకానికి వాడవలసి ఉంటుంది. అవసరం అనిపిస్తే విత్తునాటిన 15 రోజుల తర్వాత ఒక కేజీ యూరియా అందించాలి.

 

కలుపు నివారణ పద్ధతులు:

విత్తనం ఎదిగే దశలో ఉన్నపుడు, సమగ్ర కలుపు నివారణ పద్దతులను పాటించాలి. కలుపు అధికంగా ఉన్న చోట్ల, వరిపైరు ఎదుగుదల లోపిస్తుంది. అంతేకాకుండా మొక్కలు చీడ పీడల భారిన పడే అవకాశం కూడా ఎక్కువ. కనుక వీలైనంత మేరకు కలుపును నివారించాలి. కలుపు సమస్య మరీ ఎక్కువుగా ఉంటె బ్యూటక్లోర్ అనే మందును 5 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. కలుపు మందు కొట్టిన వెంటనే నీటి తడులు అందించకూడదు

సూక్ష్మ పోషకలోపాల నియంత్రణ:

మన తెలుగు రాష్ట్రాల్లోని వరి పంట వేసే రైతులు ప్రధానంగా సూక్ష్మపోషక సమస్యలను ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా జింక్ లోపం ఎక్కువుగా కనిపిస్తుంది. జింక్ లోపం ఉన్న మొక్కల ఆకులు లేత పసుపు వర్ణంలోకి మారి, ఆకుల చివరన మచ్చలు ఏర్పడి ఎండిపోవడం గమనించవచ్చు. అటువంటి సమయంలో 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ఒక లీటర్ నీటికి కలిపి ఆకుల మీద పిచికారీ చెయ్యాలి.

అంతేకూండా మొక్కలు ఎదిగే దశలో ఉన్నపుడు, అనేక చీడ పీడలు ఆశిస్తాయి, వాటిలో కాండం తొలుచు పురుగులను ప్రధానమైనవిగా భావిస్తారు. వీటిని నియంత్రించడానికి, కార్బొఫ్యురాన్ గుళికలు మొక్క మొదట్లో వెయ్యాలి. ఈ విధంగా మెరుగైన యాజమాన్య పద్దతులను పాటిస్తూ, వరి నాళ్లను పెంచాలి. విత్తు నాటిన 20-25 రోజుల తర్వాత వరి నాళ్లను ప్రధాన పొలంలో నాటుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine