Kheti Badi

All about zaid season : జియాద్ సీజన్ గురించి మీకోసం..

KJ Staff
KJ Staff
zaid Season Crop watermelon
zaid Season Crop watermelon

జియాద్ సీజన్.. ఎండా కాలంలో పండించే సీజన్ ఇది. ఫిబ్రవరి, మార్చి నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్ జూన్, జులైతో ముగుస్తుంది. రెండు నుంచి నాలుగు నెలల్లోనే మంచి లాభాలను అందించే పంటలు ఈ సీజన్ లో పండిస్తుంటారు రైతులు.

రబీకి, ఖరీఫ్ కి మధ్య ఆదాయం తగ్గకుండా చేస్తాయి ఈ పంటలు. కొన్ని సంవత్సరాల నుంచి జియాద్ సీజన్ లో పంటలు పండించేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహిస్తోంది. అయితే ఖరీఫ్ పంటల 107 మిలియన్ హెక్టార్లలో పంటలు పండిస్తే అందులో కేవలం 2 శాతం మాత్రమే జియాద్ సీజన్ లో పండించడం విశేషం.

జియాద్ లో పండించగల పంటలు

* తర్భూజా

* పుచ్చకాయ

* గుమ్మడి కాయ

* కీర దోస

* కాకర కాయ

* చెరుకు

* వేరు శనగ

* పొద్దు తిరుగుడు

* కొన్ని రకాల పప్పు ధాన్యాలు

జియాద్ పంటలు చాలా తక్కువ కాలానికి పండించేవి. మార్చి నుంచి ఏప్రిల్ వరకు లేదా మే నుంచి జూన్ వరకు వీటిని పండిస్తారు.

జియాద్ పంటలు ఎక్కువగా పండించే రాష్ట్రాలు

జియాద్ పంటలు ఎక్కువగా నీటి పారుదల సౌకర్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అయిన ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, గుజరాత్, తమిళనాడులో ఎక్కువగా పండిస్తారు. కానీ మన రాష్ట్రంలో కూడా ఈ సీజన్ లో పండించే పంటలు పెరుగుతుండడంతో పంట సాగు అయ్యే భూమి విస్తీర్ణం ప్రతి సంవత్సరం పెరుగుతోంది.

జియాద్ పంటలు ఎందుకు ప్రధానమంటే..

* ఇవి సాధారణంగా ఎండాకాలంలో పండించే పంటలు. వర్షాభావం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఖరీఫ్, రబీ పంటలు సరిగ్గా పండని చోట్ల వీటిని ప్రయత్నించవచ్చు. అయితే నీటి పారుదల సౌకర్యం ఎక్కువగా ఉంటే ఆ నేలల్లో ఈ పంటలు పండించడం మంచిది.

* చెరుకు పంట తప్ప మిగిలినవన్నీ కేవలం రెండు నుంచి మూడు నెలల పాటు మాత్రమే పండించవచ్చు.

* రైతులకు చాలా తక్కువ కాలంలో మంచి దిగుబడిని అందించే పంటలు. వారికి మంచి లాభాలను అందిస్తాయి.

* జియాద్ పంటలకు పంటల ప్రారంభ స్థాయిలో ఉన్నప్పుడు ఎక్కువ వేడి, పొడి వాతావరణం ఉండాలి. అంతే కాదు.. పూలు పూసే సమయంలో పగలు ఎక్కువగా రాత్రి తక్కువగా ఉండాలి. అందుకే మార్చి నుంచి జూన్ నెలలు ఈ పంటలకు అత్యంత అనువైనవి.

* జియాద్ లో ఎక్కువగా పండే పంటలు పండ్లు, కూరగాయలు.. ఇవి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. అంతే కాదు.. ఖరీదు కూడా బాగానే ఉండడంతో రైతుకు కూడా మంచి లాభాలను అందిస్తాయి.

ప్రభుత్వ పథకాలు

తాజాగా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం కూడా జియాద్ సీజన్ కి ప్రాముఖ్యతను ఇవ్వడం ప్రారంభించింది. ఖరీఫ్ లో పంటలు సరిగ్గా పండనప్పుడు దాన్ని ఈ సీజన్ లో పండించి లోటును భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని రకాల పప్పు ధాన్యాలను ఎక్కువగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పండించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పెసర పప్పు, మినప్పప్పు వంటివి ఈ సీజన్ లో ఎక్కువగా పండిస్తున్నారు. సాధారణంగా అకాల వర్షాల వల్ల ఈ కాలంలోనూ పంటలు నాశనమయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే ఇది చాలా తక్కువ. అంతే కాదు.. సరైన పంట మార్పిడి పద్ధతులు పాటిస్తూ నేల కోతకు కాకుండా చూసుకుంటే చాలు.. వీటి నుంచి కూడా ఆదాయం పొందే వీలుంటుంది. ఈ ఏడాది ప్రభుత్వం పెసర, మినుముల సాగు పెంచేందుకు చర్యలు చేపట్టింది. 4.9 మిలియన్ల హెక్టార్లలో పెంచేలా చర్యలు చేపట్టింది.

https://telugu.krishijagran.com/agripedia/know-about-different-crop-seasons-kharif-rabi-and-zaid/

https://krishijagran.com/agriculture-world/center-pushes-for-zaid-crops-to-lessen-kharif-deficit/

Share your comments

Subscribe Magazine