News

17 లక్షల ఎకరాలలో వరిసాగు ..

Srikanth B
Srikanth B
17 lakh acres of paddy, 3 lakh acre maize  sown in telangana as 12 January 2023
17 lakh acres of paddy, 3 lakh acre maize sown in telangana as 12 January 2023

 


తెలంగాణాలో వరిసాగు ఒక ఉద్యమంలా సాగుతుంది యాసంగి పంట కాలం మొదలయిన కొద్దీ రోజులలలోనే 17 లక్షల ఎకరాలలో వరి సాగు జరిగింది , గత సంవత్సరం ఇదే సమయానికి 8 లక్షల ఎకరాలలో వరి సాగు జరగగా ఈ సంవత్సరం పంట సీజన్ ప్రారంభ దశ లోనే రికార్డు స్థాయిలో సాగు జరిగింది . పంట సీజన్ ముగిసే నాటికీ దాదాపు 50 లక్షల ఎకరాలలో వారి సాగు ఉండవచ్చని వ్యవసాయ శాఖ అంచనాలను వేస్తుంది .

 

 

అత్యధికముగా నిజామాబాద్ 2,84,393, జగిత్యాల - 1,71,644, కరీంనగర్ - 1,38,695,నల్లగొండ , 1,38,429 , సూర్యాపేట 1,68,373 యాదాద్రి లో 1,40,908వేల ఎకరాలలో వరి నాట్లు పూర్తయ్యాయి . గత ఏడాది తో పోలిస్తే గరిష్టముగా సాగు జారింది , భూగర్భ జలాలు పెరగడం , నీటి లభ్యత అధికముగా ఉండడంతో రైతులు వరి నాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు .

పంటల వారీగా సాగు వివరాలు ;

వరి 

17,98,466 ఎకరాలలో 

గోధుమ

6,660      ఎకరాలలో 

జొన్న

62,945     ఎకరాలలో 

సజ్జలు

296    ఎకరాలలో 

మొక్కజొన్న

3,21,537 ఎకరాలలో 

రాగి

3 5      ఎకరాలలో 

కొర్ర

40          ఎకరాలలో 

మిర్చి

0          ఎకరాలలో 

ఉల్లి

0          ఎకరాలలో 

పత్తి

668        ఎకరాలలో 

పురుగు మందు డబ్బాలపై ఉండే ఈ గుర్తులకు అర్ధం ఏంటో తెలుసా !

వరి సాగు అధికం గ  సాగవుతుంటే  మరోవైపు కేంద్రం IYOM ఇంటర్ నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్ ను ప్రకటించింది , వరిసాగు పెరుగుతుండడంతో చిరుధాన్యాల సాగు క్రమేపి తగ్గుతుంది . పంట సాగుకు అధిక శ్రమ లేకపోవడంతో రైతులు అధికంగా వరి సాగువైపు మొగ్గు చూపుతున్నారు , నీటి లభ్యత ,భూగర్భజలాలు పెరగడం కూడా దీనికి మరొక కారణం గ చెప్పవచ్చు .

పురుగు మందు డబ్బాలపై ఉండే ఈ గుర్తులకు అర్ధం ఏంటో తెలుసా !

 

Share your comments

Subscribe Magazine