News

జులై నుంచి గృహలక్ష్మి..ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల ఆర్థిక సాయం !

Srikanth B
Srikanth B
జులై నుంచి గృహలక్ష్మి..ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల ఆర్థిక సాయం !
జులై నుంచి గృహలక్ష్మి..ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల ఆర్థిక సాయం !

సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వంద శాతం రాయితీతో ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున లబ్ధిదారులకు సాయం అందించనుంది ప్రభుత్వం. అయితే పథకం మార్గదర్శకాలు ఏంటి ? ఎవరు అనర్హులు ? ఎంత మందిని ఎంపిక చేస్తారు ? నిధులను ఎలా విడుదల చేస్తారు ? దరఖాస్తులు ఎవరికీ సమర్పించాలి వంటి విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం !

పథకం మార్గదర్శకాలు ఏంటి ?

తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం దీనికి అర్హులు

లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి/ జన్ ధన్ ఖాతాను వినియోగించకూడదు

మహిళ పేరుపై మాత్రమే ఇల్లు మంజూరు అవుతుంది

ఇంటిని లబ్ధిదారులు తమకు ఇష్టమైన డిజైన్‌ లో నిర్మించుకునే వెసులుబాటు ఉంటుంది

ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన ఇంటిపై ప్రభుత్వం ఆమోదించిన గృహలక్ష్మి లోగోను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది .

ఎవరు అనర్హులు ?

ఇప్పటికే ఆర్‌సీసీ ఇళ్లు ఉన్న వారు ,జి .ఓ 59 కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు.

ఏ దశలో ఎంత సాయం అందిస్తుంది ?
ఇంటి బేస్‌ మెంట్‌ లెవెల్‌ లో లక్ష రూపాయలు
రూఫ్‌ లెవెల్‌ మరియు స్లాబ్ లెవల్లో లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం ?

రైతుబంధు కటాఫ్ డేట్ ఫిక్స్ ... జూన్‌ 16 కటాఫ్ డేట్!

ఎంత మందిని ఎంపిక చేస్తారు ?

రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున లబ్ధిదారులకు సాయం అందించనుంది ప్రభుత్వం . అదనంగా రాష్ట్ర రిజర్వు కోటాలో 43 వేల మందిని కలుపుకొని , మొత్తంగా 4 లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం అందనుంది. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను సెలెక్ట్ చేయాలని మార్గదర్శకలలో ప్రభుత్వం తెలిపింది.

పథకం ఎప్పటినుంచి ప్రారంభం అవుతుంది ?

ఈ పథకాన్ని జులై నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం కలెక్టర్ వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. ఆర్థిక సాయం అందని వారిని వెయిటింగ్‌ లిస్ట్‌లో పెట్టి భవిష్యత్‌లో ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకం అమలు కోసం ప్రత్యేక పోర్టల్‌, మొబైల్‌ అప్లికేషన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.

రైతుబంధు కటాఫ్ డేట్ ఫిక్స్ ... జూన్‌ 16 కటాఫ్ డేట్!

Related Topics

gruhalakshimi

Share your comments

Subscribe Magazine

More on News

More