రాష్ట్రంలోని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందనే అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 662 ప్రభుత్వ పాఠశాలలను పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పాఠశాలల పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈక్విటీ, యాక్సెస్, క్వాలిటీ మరియు ఇన్‌క్లూజన్‌తో సహా విద్యార్థులు సమగ్ర అభివృద్ధిని సాధించడంలో సహాయపడే పాఠశాలల జాబితాను కేంద్ర విద్యా శాఖ మంగళవారం ఆమోదించింది.
కేంద్ర ప్రభుత్వం దేశంలో ఈ పథకాన్ని పోయిన సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఆమోదించిన ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం వచ్చేసి దేశంలోని పాత పాఠశాలల్లో పిల్లలకు కావలసిన మౌలిక సదుపాయాలను, పరికరాలను అందించి మోడెర్న్ పాఠశాలలుగా మార్చచడం. ఈ పాఠశాలల్లోని విద్యార్థులకు అందుబాటులోకి ప్రయోగశాలలు, చదువుకోవడానికి గ్రంథాలయాలు, స్మార్ట్ క్లాస్‌రూములు మరెన్నో సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది.
దశలవారీగా దేశంలోని పాత పాఠశాలలు అన్నిటిని స్మార్ట్ క్లాస్‌రూములుగా ప్రభుతం తీర్చిదిద్దనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను ఎంపిక చేశారు. త్వరలోనే ఈ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ వాటి ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని అన్ని రాష్ట్రాల పాఠశాలలకు అవకాశమిచ్చింది.
ఇది కూడా చదవండి..
కేంద్రం దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఫుడ్ స్ట్రీట్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది ఏర్పాటు
పాఠశాలలు ఈ పథకానికి ఎంపిక కాయావాలంటే కేంద్ర విద్య శాఖ నియమాల ప్రకారం గ్రామీణ ప్రాంత స్కూళ్లకు 60 శాతం మరియు అర్బన్ స్కూళ్లకు 70 శాతం పైగా స్కోరు సాధించి ఉండాలి. కేవలం ఆ పాఠశాలలను మాత్రమే ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అందిన దరఖాస్తుల్లో మొత్తానికి 622 పాఠశాలలను ఈ పథకానికి ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో 33 ప్రాథమిక పాఠశాలలు, 629 సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలలు.
ల్యాబ్‌ల వంటి ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త పాఠశాలలను నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ కొత్త పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలు ఉంటాయి. కేంద్ర నిధులతో నడిచే పాఠశాలలను సద్వినియోగం చేసుకొని నూతన విద్యా ప్రమాణాల ప్రకారం పాఠశాలలను బలోపేతం చేయనున్నారు.
కేంద్ర విద్యా శాఖ 60% నిధులను అందిస్తుంది, అనంతరం మిగిలిన నిధులను రాష్ట్ర విద్యాశాఖలు భరించవలసి ఉంది. కొత్త విద్యా విధానంలో పాల్గొనేందుకు ఎంపికైన పాఠశాలల జాబితాను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది.
ఇది కూడా చదవండి..
Share your comments