News

కేంద్రం దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఫుడ్ స్ట్రీట్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది ఏర్పాటు

Gokavarapu siva
Gokavarapu siva

కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రజలందరికీ మంచి ఆహార అలవాట్లను నేర్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 100 జిల్లాల్లో ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనికి తగిన చర్యలను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది.

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలలో సురక్షితమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుంది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొత్తానికి 100 జిల్లాలో ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు చేస్తుంటే, అందులో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 4 మరియు తెలంగాణలో 4 ఏర్పాటు చేయనున్నారు.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహకారంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మరియు ఆహారం ద్వారా వచ్చే వ్యాధులను తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రాష్ట్రాలకు ఈ ఆహార వీధి ఏర్పాట్ల కొరకు ఒక్కో దానికి కోటి రూపాయలను కేటాయిస్తుంది.

ఇది కూడా చదవండి..

ఒక్కసారిగా తగ్గిన ధరలు.. ఆందోళనలో రైతులు

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మరియు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి మనోజ్ జోషి అన్ని రాష్ట్రాలకు లేఖలు రాస్తూ స్థానికంగా ఉపాధి కల్పించేందుకు మరియు పర్యాటక రంగం మరియు ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి రూపొందించిన కొత్త కార్యక్రమం గురించి తెలియజేసారు.

ఈ కార్యక్రమం ద్వారా అక్కడ నివసించే ప్రజలకు కూడా జీవనోపాధి కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనితో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మరియు ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా సహకారంతో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి..

ఒక్కసారిగా తగ్గిన ధరలు.. ఆందోళనలో రైతులు

Share your comments

Subscribe Magazine