News

తెలంగాణ: రైతులకు శుభవార్త..... మీ ఖాతాల్లో రూ.10,000 జమ ఎప్పుడంటే.....

KJ Staff
KJ Staff

తెలంగాణాలో అకాలంగా కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఊరట అందించింది. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు అందరికి రూ. 10,000 నష్టపరిహారం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో పంట కోతకు వచ్చింది. వరి మరియు ఇతర పళ్ళు కూరగాయలు కోత ముమ్మరంగా సాగుతుంది. పంట చేతికి వస్తుందన్న ధీమాతో రైతన్నలు ఉండగా, అకాల వర్షాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. భలమైన వానలకు పంట నేలకొరిగింది, మరికొన్ని ప్రాంతాల్లో ఆరబెట్టినా ధాన్యం తడిచి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, పళ్ళ మొక్కల్లో పూత రాలిపోయింది. పొల్లాలోని ధాన్యం తడిచి మొలకెత్తింది. ఈ వానలు నిమ్మ, బత్తాయి, దానిమ్మ సాగు చేసే రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి.

అయితే పంట నష్టపోయిన రైతులకు ఊరట కలిగించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది, నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు చొప్పున నష్ట పరిహారం అందించేందుకు సంసిద్ధమైంది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 15.81 కోట్ల రూపాయిలు ఖర్చు చెయ్యనుంది. ప్రస్తుతం దేశంలో ఎన్నికల కోడ్ నిబంధన ఉన్నందువల్ల ఎన్నికల సంగం అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. అనుమతి వచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా కాంగ్రెస్ హామీల్లో భాగంగా అమలుచేస్తామన్న రుణమాఫీని కూడా రానున్న ఆగష్టు 15 లోపు అమలుచేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా రెండు లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చెయ్యనున్నారు.

Share your comments

Subscribe Magazine