పోటీ పడటం అంటే నాకు ఎవరు సాటి రారని నిరూపించేందుకు నెల్లూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు పోటీ పడ్డారు. పంతంతో వీళ్లకు వచ్చేది ఏమి ఉండదని తెలిసిన కూడా పంతాలకు పోతారు. వీళ్ళు పోటీ పడ్డామంటే కచ్చితంగా గెలవాలని భావిస్తారు. ఇలా ఒక టీ స్టాల్ ప్రారంభోత్సవం దగ్గర ఇద్దరి వ్యక్తుల మధ్య పోటీ కారణంగా 10 రూపాయల విలువగల ఒక కప్పు టీ ధర ఏకంగా 10 వేల రూపాయలకు చేరుకుంది. రాష్ట్రంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్త వివరాలు ఇప్పుడు తెలిసుకుందాం.
సాధారణంగా ఒక కప్పు టీ ధర సుమారుగా రూ.10 ఉంటుంది. కానీ ఒక దుకాణంలో ఈ టీ కప్పు ధర ఏకంగా 10 వేల రూపాయలకు చేరుకుంది. 10 వేలు ఏంటి అని ఆశ్చర్య పోకండి, ఇలా జరగడానికి ఒక పెద్ద కారణమే ఉంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వేలంపాట అనేది వినాయక చవితికి లడ్డు విహాయంలో చూసి మనం ఉంటాం. కానీ ఒక టీ స్టాల్ ఓపెనింగ్ లో మొదట టీ కోసం నెల్లూరు జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక పోటీ వేలం పాటలాగా మారిపోయింది. ఇందులో ఓక వ్యక్తి ఆ టీని 10 వేల రూపాయలకు సొంతం చేసుకున్నాడు.
ఈ సంఘటన నెల్లూరు జిల్లాకు చెందిన ధనలక్ష్మీపురంలో చోటుచేసుకుంది. ఈ జిల్లాలో కేజీకే కల్యాణ మండపం దగ్గర ఒక వ్యాపారి టీ కేఫ్ ప్రారంభించారు. దీనికోసం బాగా ప్రచారం చేసాడు మరియు ప్రారంభోత్సవానికి ఆ ఓనర్ తన బంధువులని మరియు తన స్నేహితులందర్నీ ఆహ్వానించాడు. ఆ వ్యాపారి అనుకున్న దానికంటే ప్రారంభోత్సవానికి ఎక్కువ జనం వచ్చారు. ఇక్కడ అనుకోకుండా జరిగిన ఒక విషయం వాళ్ళ ఆ కేఫ్ కి మరింత ప్రచారం జరిగింది.
ఇది కూడా చదవండి..
UPI lite :రూ.200 వరకు UPI పెమెంట్స్ చేయడానికి ఇప్పుడు నెట్, పిన్ అవసరంలేదు!
ప్రారంభోత్సవానికి కోసూరు కేశవులు మరియు ఉప్పల ఈశ్వరయ్య అనే ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు. ఈ ఇద్దరు కూడా ఆ వ్యాపారికి బాగా తెలిసిన వ్యక్తులే. ఓనర్ మొదటి టీని కొని బోణి చేయమని అక్కడికి వచ్చిన వారిని అడిగాడు.
అక్కడ ఉన్న ఈశ్వరయ్య ఆ మొదటి టీని 500 రూపాయలు ఇచ్చి కొంట అని చెప్పాడు. ఇంతలో కేశవులు ఈ మొదటి టీకి 1000 రూపాయలు ఇచ్చి, తానే బోణి చేస్తా అని చెప్పాడు. ఇలా ఈ ఇద్దరి వ్యక్తుల మధ్య మాటల యుద్ధం జరిగి, పది పది పెంచుకుంటూ వెళ్లడంతో ఒక్క కప్పు టీ ధర 10వేల రూపాయలకు చేరింది. చివరకు కేశవులు 10 వేల రూపాయలు చెల్లించి బోణి చేసాడు.
ఈ విషయం అక్కడ ప్రజల నోటా పలికి బాగా ప్రచారం జరిగింది. 10వేల రూపాయలు పెట్టి కోసూరు కేశవులు టీ తాగాడని, ఆయన పేరుతో పాటు ఆయన టీ తాగిన కేఫ్ పేరు కూడా మారుమోగిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి..
Share your comments