గ్రీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ మరియు అమ్మోనియా ఉత్పత్తిపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
పారిశ్రామిక అభివృద్ధికి ఏపీ ప్రతి సంవత్సరం ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇస్తుందని, ప్రత్యేక నిధుల ద్వారా పారిశ్రామిక పార్కుల్లో కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని, పరిశ్రమలు వీలైనంత త్వరగా తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలు కల్పిస్తుందని సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా పెద్ద మొత్తంలో ఉపాధి లభించనుందని ,వీటిపై ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయని, ఈ ప్రాజెక్టుల కోరకు దాదాపు 66వేల ఎకరాలకుపైగా భూములు అవసరమవుతాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
గ్రీన్ ఎనర్జీపై చర్చిస్తూ, కుదుర్చుకున్నఅవగాహనా ఒప్పందాల ఆధారంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో 30,000 మందికిపైగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం 66 వేల ఎకరాలకు పైగా భూమి అవసరం ఉంటుందని , బీడు భూములకు ఎకరానికి రూ.30 వేలకు పైగా ప్రతి ఏటా చెల్లిస్తే రైతులకి మంచి ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.
అయితే దీనికి సంబంధించిన పాలసీలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇథనాల్ ఉత్పత్తితోపాటు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియాపై దృష్టి సారించాలని సూచించారు.
వారు ఇంకా మాట్లాడుతూ, పారిశ్రామిక విధానంపై ప్రభుత్వం పారదర్శక విధానాలను అమలు చేస్తోందని, విద్యుత్, రోడ్లు, రైల్వే వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని సీఎం చెప్పారు. సింఘ్వీస్, బిర్లాల వంటి అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి తమ ప్రాజెక్టులను ప్రారంభించడానికి అవగాహనా ఒప్పొందాలు చేస్తున్నారని అన్నారు.
మరిన్ని చదవండి.
Share your comments