నాబార్డ్ తాజా నివేదికప్రకారం వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.
వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు దేశంలోని వివిధ రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులను నాబార్డ్ వార్షిక నివేదిక విశ్లేషిస్తుంది. National Bank for Agriculture and Rural Development (నాబార్డ్ ) ప్రచురించిన నివేదిక ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో రైతుల కోసం రూ. 11,477 కోట్లు మరియు రైతులకు సంబంధించిన మౌలిక సదుపాయాల కొరకు కేటాయించింది.
నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో నిల్వలు, గిడ్డంగులు, నీటిపారుదల, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత ఇస్తోందని నివేదిక పేర్కొంది.
రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ స్థాయిలో వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. ఈ కేంద్రాలతో పాటు రైతులు పండించిన పంటల నిల్వ కోసం గోదాములను కూడా నిర్మించి, రైతులు పండించిన ధాన్యాన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే సేకరిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.2,269.30 కోట్లతో 10,315 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో ఇప్పటికే 2,287 భవనాలు పూర్తికాగా, మరో 1,948 నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. ఈ ఏడాది లోగా మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. అంతే కాకుండా పాడి రైతుల కోసం రూ.399.01 కోట్లతో మొదటి దశలో 2,535 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు.
నాబార్డ్ నివేదిక ప్రకారం వ్యవసాయ రంగం లో ఆంధ్రప్రదేశ్ వార్షికంగా 2. శాతం వృద్ధి రేటుని నమోదు చేసింది. తరువాతి స్థానంలో అస్సాం నిలిచింది. వ్యవసాయ వార్షిక వృద్ధి రేటులో తెలంగాణ -7.4 శాతానికి పడిపోయింది.
మరిన్ని చదవండి.
Share your comments