News

రైతులకు నాణ్యమైన విత్తన సరఫరా..... వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి!

S Vinay
S Vinay

రైతులకు నాణ్యమైన విత్తనాన్ని సరఫరా చేయడంపైనే విత్తనోత్పత్తి రంగంలోని వాటాదారులందరూ దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి అన్నారు.

2030 నాటికి జీరో హంగర్' లక్ష్యంతో పని చేయడం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాన్ని సరఫరా చేయడం ద్వారా ఆహార ఉత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.రైతుకు నాణ్యమైన విత్తనం అందినప్పుడే మంచి దిగుబడి వచ్చి వ్యవసాయం లాభసాటిగా మారుతుందని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికై అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలకు సంబంధించి విస్తృత పరిశోధనలు అవసరం ఉందని తెలిపారు.

కైరోలో జరిగిన 33వ ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ (ఐఎస్‌టిఎ) వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న విత్తన పరిశ్రమలలో భారతదేశం ఒకటని అన్నారు. "రైతులు అధిక వ్యవసాయ ఉత్పత్తిని సాధించేందుకు వీలుగా నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసేందుకు అన్ని దేశాలకు కఠినమైన నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని అని ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్లకు పైగా ప్రజలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా, మరో రెండు బిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాన్ని సరఫరా చేయడం ద్వారానే దిగుబడి పెంచడం తో పాటు పోషకాహార లోపాన్ని కూడా అంతం చేయవచ్చని ఆయన అన్నారు.

విత్తన పరిశోధనలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని దేశాలతో పంచుకోవడంలో ISTA భాగస్వామ్యాన్ని మరింత కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా విత్తన పరిశ్రమ వృద్ధిరేటు 5శాతం కాగా భారతదేశం లో అది 12-15 శాతంగా ఉందన్నారు. భారతీయ విత్తన పరిశ్రమ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు.దేశంలోని విత్తనోత్పత్తిలో దాదాపు మూడింట ఒక వంతు వాటా కలిగిన తెలంగాణ 2014-15 మరియు 2020-21 మధ్య కాలంలో దాదాపు 85 శాతం వృద్ధి చెందిందని ఆయన తెలిపారు.

మరిన్ని చదవండి.

అరటి లో దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన రకాలను తెలుసుకోండి!

Share your comments

Subscribe Magazine