Agripedia

సీడ్ మరియు ఫెర్టిలైజర్ లైసెన్స్ పొందడం ఎలా?

Srikanth B
Srikanth B

తక్కువ పెట్టుబడి తో వ్యాపారం చేయాలన్న ఆలోచనలో వున్నట్లయితే ఈ ఆర్టికల్ మీకోసమే , ఇప్పుడు గ్రామా గ్రామాన సాగు నీరు యొక్క లభ్యత పెరిగినా క్రమం లో వ్యవసాయ సాకు కూడా అదే రీతిలో లో విస్తరిస్తుంది , ఇ తరుణం లో తక్కువ పెట్టుబడి తో వ్యాపారం చేయాలన్న చేయాలనుకునే వారికీ ఎరువులు, విత్తనం లేదా వెర్మిన్-కంపోస్ట్ యొక్క దుకాణాలు తెరవడం ఒక్క ఉత్తమమైనా ఎంపికగా చెప్పవచ్చు అయితే . కానీ దీనికి మీకు లైసెన్స్ అవసరం! అర్హత ప్రమాణాలు,మరియు ఈ లైసెన్స్ కొరకు ఎలా దరఖాస్తు చేయవచ్చు? అనే అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి .

లైసెన్స్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది?

ఎరువుల అమ్మకాల కు రిటైల్ లైసెన్స్ కోసం దరఖాస్తు రుసుమును రూ.2500గా నిర్ణయించారు.

హోల్ సేల్ లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజును రూ.4500గా నిర్ణయించారు.

ఎరువులు మరియు విత్తనాలను విక్రయించడానికి లైసెన్స్ పొందడం ఎలా?

లైసెన్స్ పొందడం కొరకు, మొదట మీరు వ్యవసాయ శాఖ యొక్క డిబిటి పోర్టల్ ని సందర్శించడం ద్వారా మీ ఆధార్ కార్డును రిజిస్టర్ చేసుకోవాలి.

తరువాత దాని అధికారిక వెబ్ సైట్ http://agrionline.telangana.gov.in/OLMS/) కు వెళ్లి, అప్లికేషన్ ఫారంలో అడిగిన మొత్తం సమాచారాన్ని సరిగ్గా నింపండి.

దీని తరువాత, అవసరమైన అన్ని డాక్యుమెంట్ లను స్కాన్ చేసి అప్ లోడ్ చేయండి.

అప్లికేషన్ పూర్తయిన తరువాత, దాని హార్డ్ కాపీ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోండి.

తరువాత ఆ హార్డ్ కాపీని వారం రోజుల్లోనే సంబంధిత ఆఫీసుకు సబ్మిట్ చేయండి.

ఆ తరువాత ఈ ప్రక్రియను డిపార్ట్ మెంట్ ప్రారంభిస్తుంది.

తరువాత హార్డ్ కాపీని సబ్మిట్ చేసిన ఒక నెలలోనే, దరఖాస్తుదారుడు లైసెన్స్ పొందుతాడు.

విత్తనమరియు ఎరువుల అమ్మకపు లైసెన్స్ కొరకు అర్హత

దీని కొరకు దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 నుంచి గరిష్టంగా 45 సంవత్సరాల వరకు నిర్ణయించబడింది. అయితే, దీనిలో రాష్ట్రం, సెంట్రల్, బోర్డు లేదా కార్పొరేషన్ నుండి రిటైర్ అయిన ఉద్యోగి యొక్క గరిష్ట వయోపరిమితిని 65 సంవత్సరాలు.

DRONE UPDATE :డ్రోన్ లను ఉప్పయోగించాలంటే ఈ నిబంధనలు ఖచ్చితం గ పాటించాలి : (krishijagran.com)

 

Share your comments

Subscribe Magazine