News

జీడితోటల ధ్వంసం కు వ్యతిరేకంగ గిరిజన మహిళా రైతుల వినూత్న .. "ఆత్మహత్యాయత్న" నిరసన !

S Vinay
S Vinay

TRIBAL WOMEN: విశాఖపట్నం జిల్లా లోని మాడుగుల మండలం ఉర్లోవ గ్రామంలో తమ జీడితోటలను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గిరిజన మహిళా రైతులు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రతీకాత్మక నిరసన చేపట్టారు.

పూర్తి వివరాలకి వెళితే రెవెన్యూ అధికారుల అండతో మైనింగ్ కంపెనీ ప్రతినిధులు జేసీబీ యంత్రాలతో తమ జీడి తోటలను ధ్వంసం చేస్తున్నారని గిరిజన మహిళలు ఆరోపించారు. దీనికి నిరసనగా గురువారం నాడు మహిళలు గుడ్డని ఒక చివర మెడకు, మరో చివర చెట్టు కొమ్మలకు కట్టుకు ని ఉరి బిగించుకున్నారు. వారు ఇంకా మాట్లాడుతూ జీడితోటల విధ్వంసానికి అడ్డుకట్ట వేయకుంటే తమ జీవితాలను అంతం చేసుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోతుందని గిరిజనులు తెలిపారు.గత కొన్నేళ్లుగా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నామని అయినప్పటికీ అధికారుల నుండి ఎలాంటి ప్రతి స్పందన లేదని గిరిజనులు వాపోతున్నారు.

గిరిజనుల వాదన ఇలా ఉండగా మరొక వైపు కంపెనీ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు తమ వాదనని కూడా వినిపిస్తున్నారు. వారు చెప్తున్న వివరాల ప్రకారం గిరిజనులు ముందుగానే ఆ కంపెనీ నుండి డబ్బులు తీసుకున్నారు అని గిరిజనుల వాదనను తోసిపుచ్చారు.

అయితే గిరిజనులు మాత్రం తమ సమస్యలను పరిష్కరించకుంటే ఏప్రిల్‌ 11న అనకాపల్లి కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగుతామని గిరిజనులు డిమాండ్‌ చేశారు. దీనిపై తక్షణమే ఐఏఎస్‌ అధికారితో విచారణ జరిపించాలని, తమ డిమాండ్‌లను నెరవెల్చాలని వారు కోరుతున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం కె.భవాని నాయకత్వం వహించారు.

మరిన్ని చదవండి.

ysr matsyakara bharosa: వైస్సార్ మత్స్యకార భరోసా పథకంలో సవరణలు,పథకానికి వీరు అనర్హులు:

Share your comments

Subscribe Magazine