ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త అందించారు ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం గ పీఎం కిసాన్ ను కలుపుకొని సంవత్సరానికి 3 మూడు దఫాలలో 13500 రూపాయలను ఆర్థిక సాయంగా అందిస్తున్న డబ్బులను నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి డబ్బులను విడుదల చేసారు . 2023-24 సంవత్సరానికి మొదటి విడతలో రైతుభరోసా 5500 వేలు పీఎం కిసాన్ 2000 వేలు కలుపుకొని రైతుల ఖాతాలో 7500 రూపాయలను బటన్ నొక్కి డబ్బులను విడుదల చేసారు ముఖ్యమంత్రి జగన్ .
2023-24 ఆర్థిక సంవత్సరానికి యే దఫా ను ఎప్పుడు విడుదల చేస్తారు .
3 విడతల్లో రూ. 13.500.. ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ. 7.500. అక్టోబర్ నెల ముగిసేలోపే ఖరీఫ్ పంట కోత సమయం. రబీ అవసరాల కోసం రూ. 4,000. పంట ఇంటికి వచ్చే సమయాన, జనవరి/ఫిబ్రవరి నెలలో రూ. 2,000 ఇలా మూడు దఫాలలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .
నేడు రిలీజ్ చేసింది ఎంత ?
రైతుభరోసా పీఎం కిసాన్ కోసం 53.62 లక్షల రైతులకు .3,934.25 కోట్లుపెట్టుబడి సాయం విడుదల చేసారు .
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 22.74 లక్షల మంది రైతన్నలకు అందించిన మొత్తం ఇన్పుట్ సబ్సిడీ అక్షరాల రూ. 1,965 కోట్లు విడుదల చేసారు .
పీఎం కిసాన్ రైతు భరోసాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 155251 నెంబర్ కు ఫోన్ చేసి పిర్యాదు చేయండి .
రైతులకు శుభవార్త: సబ్సిడీతో ఆర్బికేలా ద్వారా విత్తనాల పంపిణీ ప్రారంభం..
రైతు వారి ఖాతాలలో డబ్బులు వచ్చాయో లేదో చాల సులువుగా తెలుసుకోవచ్చు .
మొదట https://ysrrythubharosa.ap.gov.in/RBApp/index.html లింక్ పై క్లిక్ చేయండి .
ఇప్పుడు మీ కుడివైపు know your status అనే ఎంపిక పై క్లిక్ చేయండి .
తరువాత మీకు 2023-24 సంవత్సరం రైతు భరోసా స్టేటస్ కనిపిస్తుది దానిపై క్లిక్ చేయండి .
2023-24 స్టేటస్ పై క్లిక్ చేసిన తరువాత మీ ఆధార్ నెంబర్ ను టైప్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి .
ఇప్పుడు మీకు మీ రైతు భరోసా స్టేటస్ కనిపిస్తుంది .
Share your comments