News

ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారెంటీడ్ పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్న AP ప్రభుత్వం!

S Vinay
S Vinay

ప్రస్తుత కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS)ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతుంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రస్తుత సీపీఎస్‌కు ఎలాంటి గ్యారెంటీ పెన్షన్‌ లేదని, బ్యాంకు వడ్డీ రేట్లతో ముడిపడి ఉన్నందున ఆ స్థానంలో మళ్లీ ఓపీఎస్‌ని ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గుతున్నందున ప్రస్తుత CPS, "అత్యల్పంగా ఉంది,
ఇది మరింత తగ్గుతుందని ఉద్యోగులు వాపోతున్నారు.

ప్రభుత్వ సిబ్బంది కోరినట్లుగా పాత పెన్షన్ స్కీమ్‌ను మార్చడం వల్ల భారీ ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం పేర్కొంది.2004 తర్వాత నిలిపివేయబడిన పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని తిరిగి ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్ర ఖజానాపై మరియు భవిష్యత్ తరాలపై భారీ ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాలు & వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.

ప్రభుత్వపు రెండు ప్రతిపాదనలు
ఉద్యోగులు పరిగణనలోకి తీసుకునేందుకు ప్రభుత్వం రెండు ఎంపికలను ప్రతిపాదించింది. మొదటి ప్రతిపాదన ప్రకారం, ఒక ఉద్యోగి తన జీతంలో ప్రతి నెలా 10 శాతం జమ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం దానికి మరో 10 శాతాన్ని జోడిస్తుంది మరియు ఉద్యోగి తన చివరిగా డ్రా చేసిన బేసిక్ పే లో 33 శాతం గ్యారెంటీ పెన్షన్‌గా పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పొందుతాడు.

రెండవ ప్రతిపాదన ప్రకారం, ఒక ఉద్యోగి తన జీతంలో 14 శాతం జమ చేస్తే, ప్రభుత్వం దానికి మరో 14 శాతాన్ని జోడిస్తుంది మరియు ఉద్యోగి తన చివరిగా డ్రా చేసిన బేసిక్ పేలో 40 శాతం పెన్షన్‌గా పొందుతాడు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనాల ప్రకారం, ప్రస్తుత CPS ఉద్యోగులకు OPS ప్రయోజనాలు అందజేస్తే, 2040 నాటికి జీతాలు, పెన్షన్లు మరియు అవసరమైన వ్యయం 181 శాతం పెరుగుతుంది.

మరిన్ని చదవండి.

క్రెడిట్ కార్డ్‌ల జారీపై RBI కొత్త నియమాలు...ఈ విషయం లో జరిమానా!

Share your comments

Subscribe Magazine

More on News

More